మూడు నెలలపాటు చలాన్లు లేవు.. ఎక్కడో తెలుసా?

Transport offices in Odisha to remain open on holidays to help motorists prepare documents, మూడు నెలలపాటు చలాన్లు లేవు.. ఎక్కడో తెలుసా?

కొత్త మోటారు వెహికల్ చట్టంపై వస్తున్న వ్యతిరేకతతో ఒడిషా ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్ట సవరణతో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడిక్కడే భారీగా చలాన్లు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల్లో ఈ కొత్త రూల్స్ దడ పుట్టిస్తున్నాయి. అయితే వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడం, హెల్మెట్లు లేకపోవడం వంటి సమస్యలతో చాలమంది వాహనదారులకు భారీగా చలాన్లు విధించారు. దీంతో వాటిని కట్టలేక అనేక మంది తమ వాహనాలకు వదిలి పెట్టి వెళ్లిపోవడం కూడా జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న ఒడిషా ప్రభుత్వం తాజాగా మూడు నెలలపాటు ఈ నిబంధనలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలపాటు ఈ సేవల్ని నిలిపివేస్తున్నట్టుగా ఒడిషా రవాణా శాఖామంత్రి పద్మనాభ బెహరా ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనలు సడలించిన ఈ మూడు నెలల్లో వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సమకూర్చుకోవాల్సిందిగా వాహనదారులకు విఙ్ఞప్తి చేశారు. వాహనాలకు సంబంధించిన పనుల నిమిత్తం పలుచోట్ల కొత్త కార్యాలయాలు సైతం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వాహనదారులు తమ వాహనాల రిజస్ట్రేషన్, పేరు మార్పు వంటి సేవల్ని త్వరగా పొందే వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *