ఆన్‌లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ కొనిస్తే.. తండ్రి ఖాతా ఖాళీ చేశాడు..

టెక్నాలజీ పెరిగే కొద్ది కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో చిన్న పిల్లలే టార్గెట్ లక్షల రూపాయలు కాజేస్తున్నారు కేటుగాళ్లు.

ఆన్‌లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ కొనిస్తే.. తండ్రి ఖాతా ఖాళీ చేశాడు..
Follow us

|

Updated on: Sep 27, 2020 | 5:28 PM

టెక్నాలజీ పెరిగే కొద్ది కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో చిన్న పిల్లలే టార్గెట్ లక్షల రూపాయలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా లక్షల్లో సొమ్ము క్షణాల్లో మాయం చేస్తన్నారు. పోలీసులు ఈ సైబర్ నేరాలపై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా మోసపోయేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మొబైల్ లో ఆన్ లైన్ లో గేమ్ పేరుతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు రూ.2.50 లక్షలు పోగొట్టిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన ట్రాన్స్‌పోర్ట్ విభాగపు అధికారి కుమారుడు ఆరు నెలలుగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ 2.50 లక్షలు పోగొట్టాడు. స్మార్ట్ ఫోన్ తో ఆన్ లైన్ క్లాసులు వింటూనే మరోవైపుకి ఖాళీ సమయాల్లో సరదాగా ఆన్ లైన్ గేమ్ ఆడేవాడు. తీరా తండ్రి తన బ్యాంకు ఖాతా చెక్ చేసుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రాలోని సికందరా నివాసి అయిన ట్రాన్స్‌పోర్ట్ తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతాలోని రూ. 2.50 లక్షలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఖాతా నుంచి చాలా తక్కువగా లావాదేవీలు నిర్వహిస్తానని, ఇటీవల చెక్ చేసుకోగా రూ. 500 మిగిలాయని తెలిపారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆ ఖాతా నుంచి పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని తేలింది. మార్చి, ఆగస్టు నెలల మధ్య ఈ లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు. అదీ కూడా తన కొడుకు స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యినట్లు వెల్లడించారు.

కాగా, సదరు అధికారి తన కొడుకు ఆన్‌లైన్ క్లాసుల కోసం ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అయితే, ఆ బాలుడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఎవరికి తెలియకుండా స్మార్ట్ ఫోన్ కు మొబైల్ నెంబర్ తండ్రి బ్యాంక్ ఖాతాను కనెక్ట్ చేశాడు. ఇదే క్రమంలో ఆ బాలుడు రివార్డ్ పాయింట్ల లాంటివాటి కోసం ఆయా గేమ్స్ కంపెనీలకు డబ్బులు చెల్లిస్తూపోయాడు. దీంతో ఏకంగా తండ్రి ఖాతా నుంచి రెండున్నర లక్షల రూపాయలను పొగొట్టాడు. విషయం వెల్లడి కావడంతో సదరు అధికారి తన ఫిర్యాదు వాపసు తీసుకుని, కుమారుడిని మందలించారు. కాగా, పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

ప్రౌండ్‌ మూమెంట.. చిరును కలిసిన మాస్కో సాంస్కృతిక బృందం
ప్రౌండ్‌ మూమెంట.. చిరును కలిసిన మాస్కో సాంస్కృతిక బృందం
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..