Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

కేబుల్ వినియోగదారులకు శుభవార్త.. రూ.160కే అన్ని ఛానళ్లు!

Trai New Rules, కేబుల్ వినియోగదారులకు శుభవార్త.. రూ.160కే అన్ని ఛానళ్లు!

టెలికం రెగ్యులేటరీ అధారిటీ(ట్రాయ్) 2017 చట్టంలో చేసిన మార్పులను అమలులోకి తీసుకురానుంది. 2020 మార్చి 1నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయని సంస్థ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ ప్రకటించారు. వినియోగదారులకు ఇకపై ఏ ఛానెల్ కావాలన్నా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందన్న ఆయన.. నూతన చట్టంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుకే ఛానెల్స్ ఎంపిక చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ట్రాయ్ ఎప్పుడూ ఛానెల్స్‌ను నియంత్రించదని.. అంతేకాకుండా సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం దేశంలో 38 బ్రాడ్‌కాస్టర్లు ఉన్నారు. ఇక అందులో 5 గురు తమ ఉచిత ఛానెల్స్‌ను పెయిడ్ ఛానెల్స్‌గా మార్చారని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం 909 ఛానెళ్లు అందుబాటులో ఉండగా వాటిలో 330 పెయిడ్ చానళ్లు ఉన్నాయన్నారు.

ఇకపోతే ఒక బొకే ఛానెల్‌కు రూ.12లు మించకూడదని.. ఇక ఒక సంస్థ ఎన్ని బొకేలు అయినా పెట్టుకునే స్వేచ్ఛ ఉందని ఆయన తెలిపారు. కాగా, ఒక భాషకు చెందిన చానల్స్ అన్నీ కూడా ఒకే క్రమంలో ఉంచాలన్నారు.

మరోవైపు టారిఫ్ ఆర్డర్‌కు సవరణలు చేసిన ట్రాయ్.. గతంలో ఉన్న బేసిక్ ప్యాక్, అలాకార్ట్ ప్యాక్ నిబంధనలను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై అన్ని ఫ్రీ టూ ఎయిర్ ఛానళ్లను రూ.160కే ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనితో వినియోగదారులపై చాలావరకు భారం తగ్గుతుందనే చెప్పాలి. అటు గతంలో ప్రతి 25 అదనపు ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్‌కు రూ.20 చెల్లించాల్సి ఉండగా దానిని కూడా ట్రాయ్ పూర్తిగా తొలగించింది.

అంతేకాకుండా ఛానెల్ ప్లేస్‌మెంట్ మార్చడానికి అనుమతులను తప్పనిసరి చేసింది. ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్స్ ఉంటే మాత్రం 40% వసూలు చేయాలని స్పష్టం చేసింది. కాగా, క్యారెజ్ ఫీజు కూడా ఒక సెట్‌అప్ బాక్స్‌కు 20 పైసలు మించకూడదని ట్రాయ్ వెల్లడించింది.