ఇకపై 30 సెకన్లు రింగ్ తప్పనిసరి.. ట్రాయ్ కీలక నిర్ణయం!

ఇన్‌కమింగ్ కాల్ రింగ్ విషయంలో టెలికాం ఆపరేటర్స్ మధ్య నెలకొన్న వివాదాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ(ట్రాయ్) తెరదించింది. మొబైల్ ఫోన్లకు కాల్ చేసినప్పుడు ఒకవేళ దాన్ని లిఫ్ట్ చేసినా.. లేక రిజెక్ట్ చేసినా.. ఖచ్చితంగా 30 సెకండ్ల పాటు రింగ్ మోగాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే ల్యాండ్ లైన్ అయితే 60 సెకన్లు మోగాలని.. అన్ని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 1న ఆదేశాలు జారీ చేస్తూ.. ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. […]

ఇకపై 30 సెకన్లు రింగ్ తప్పనిసరి.. ట్రాయ్ కీలక నిర్ణయం!
Follow us

|

Updated on: Nov 02, 2019 | 2:23 AM

ఇన్‌కమింగ్ కాల్ రింగ్ విషయంలో టెలికాం ఆపరేటర్స్ మధ్య నెలకొన్న వివాదాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ(ట్రాయ్) తెరదించింది. మొబైల్ ఫోన్లకు కాల్ చేసినప్పుడు ఒకవేళ దాన్ని లిఫ్ట్ చేసినా.. లేక రిజెక్ట్ చేసినా.. ఖచ్చితంగా 30 సెకండ్ల పాటు రింగ్ మోగాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే ల్యాండ్ లైన్ అయితే 60 సెకన్లు మోగాలని.. అన్ని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 1న ఆదేశాలు జారీ చేస్తూ.. ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

అయితే ఇటీవల జియో, ఎయిర్‌టెల్, ఐడియా వంటి కంపెనీలు వాటంతట అవే ఇన్‌కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించాయి. మొదట జియో రింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించగా.. మిగతా రెండు సంస్థల కూడా అదే బాట పట్టి వాటి కాల్ రింగ్‌ను కుదించాయి. దీనితో మిస్డ్ కాల్స్ సంఖ్య పెరిగింది… వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ రంగంలోకి దిగి రింగ్ టైం 30 సెకన్లకు ఫిక్స్ చేయడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది.