చెన్నైలో దారుణ ఘటన.. పదమూడేళ్ల బాలికతో వ్యభిచారం.. అమ్మాయిపై పలుమార్లు లైంగిక దాడి చేసిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్..

కంచే చేను మేసిన విధంగా, అండగా ఉండాల్సిన పోలీసులే అమ్మాయిలను నయవంచనకు గురిచేస్తున్నారు. రాజకీయనాయకులు, రౌడీలతో కలిసి వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే తమిళనాడులోని చెన్నైప్రాంతంలో జరిగింది.

  • uppula Raju
  • Publish Date - 1:03 pm, Wed, 25 November 20
చెన్నైలో దారుణ ఘటన.. పదమూడేళ్ల బాలికతో వ్యభిచారం.. అమ్మాయిపై పలుమార్లు లైంగిక దాడి చేసిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్..

కంచే చేను మేసిన విధంగా, అండగా ఉండాల్సిన పోలీసులే అమ్మాయిలను నయవంచనకు గురిచేస్తున్నారు. రాజకీయనాయకులు, రౌడీలతో కలిసి వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే తమిళనాడులోని చెన్నైప్రాంతంలో జరిగింది. పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇన్‌స్పెక్టర్‌ను, ఓ బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

షబీనా అనే మహిళ రెండు రోజుల క్రితం వాషర్ మెన్ పేట మహిళా పోలీసులను ఆశ్రయించింది. తన అక్క సమిత భానుతో పాటు కొంతమంది పదమూడేళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, ఆమెపై ప్రతిరోజూ లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో బీజేపీ నాయకుడు రాజేంద్రన్ కూడా ఉన్నాడు. పోలీసులు ఇతనిపై ప్రత్యేక దృష్టి సారించి విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నూరు క్రైం డిపార్ట్‌మెంట్ ఇన్సెపెక్టర్ పుహలేంది, తాను కలిసి ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశామని తెలిపాడు. దీంతో పుహలేందిపై మహిళా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో పుహలేంది బాలికను తీసుకొని రాజేంద్రన్ కార్యాలయానికి వెళ్లినట్లు ఆధారాలు లభించాయని మహిళా ఇన్‌స్పెక్టర్ ప్రియదర్శిని తెలిపారు. దీంతో ఇన్‌స్పెక్టర్ పుహలేందిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.