Anchor Suma యాంకర్ సుమ ఇంట్లో విషాదం… ఆమె వదినమ్మ..!
ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది. సోమవారం సుమ అత్తగారింట్లో ఆమె దగ్గరి బంధువు కన్నుమూశారు. దాంతో సుమతోపాటు..
Tragedy in Anchor Suma home: ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది. సోమవారం సుమ అత్తగారింట్లో ఆమె దగ్గరి బంధువు కన్నుమూశారు. దాంతో సుమతోపాటు.. ఆమె భర్త రాజీవ్ కనకాల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన వెంటనే సుమ, రాజీవ్ కనకాల బంధువులు, వారి సన్నిహితులు పెద్ద సంఖ్యలో వారింటికి చేరుకున్నారు.
యాంకర్ ప్రజెంటర్ సుమ భర్త రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి సోమవారం మధ్యాహ్నం కన్ను మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సుమ కుటుంబీకులు తెలిపారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాల ఇద్దరి సంతానంలో రాజీవ్ కనకాల ఒకరు కాగా శ్రీలక్ష్మి మరొకరు. శ్రీలక్ష్మి భర్త ప్రముఖ పాత్రికేయుడు పెద్ద రామారావు. శ్రీలక్ష్మి, పెద్ద రామారావు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు.
శ్రీలక్ష్మి కనకాల… దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరితము సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టారు. పలు సీరియళ్ళలో నటించారు. తన తండ్రి దేవదాస్ కనకాల దర్శకత్వంలో పలు సీరియళ్ళలోను, టెలిఫిల్మ్స్లోను శ్రీలక్ష్మి నటించారు. తెలుగుతోపాటు కన్నడ, హిందీ సీరియళ్ళలోను ఆమె నటించి తన ప్రతిభను చాటుకున్నారు.