షాకింగ్‌.. ఇంటి కోసం తవ్వతుంటే.. పెద్ద ఎత్తున బయటపడ్డ బాంబులు..

మణిపూర్‌లో పెద్ద ఎత్తున బాంబులు బయటపడ్డాయి. అవి కూడా ఇప్పటివి కాదు.. ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం నాటివి. ఇంటి నిర్మాణం కోసం.. స్థలాన్ని చదునుచేస్తూ.. తవ్వకాలు జరుపుతుండగా.. కొన్ని అనుమానాస్పద..

షాకింగ్‌.. ఇంటి కోసం తవ్వతుంటే.. పెద్ద ఎత్తున బయటపడ్డ బాంబులు..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 4:12 AM

మణిపూర్‌లో పెద్ద ఎత్తున బాంబులు బయటపడ్డాయి. అవి కూడా ఇప్పటివి కాదు.. ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం నాటివి. ఇంటి నిర్మాణం కోసం.. స్థలాన్ని చదునుచేస్తూ.. తవ్వకాలు జరుపుతుండగా.. కొన్ని అనుమానాస్పద వస్తువులు బయటపడ్డాయి. మణిపూర్‌లోని మోరే ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బయటపడ్డ వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించగా అవి బాంబులు అని తేలింది. దీంతో వణికిపోయిన స్థల యజమాని.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటిని బాంబులుగా గుర్తించిన పోలీసులు.. అవి ఇప్పటివి కాదని.. రెండో ప్రపంచ యుద్ధం నాటివంటూ తేల్చేశారు. అప్పట్లో పేలని బాంబులన్నీ.. అలాగే భూమిలో కూరుకుపోయాయని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని మోరే ఏఎస్‌పీ సాంగ్‌బోయి గంగ్టే తెలిపారు. బయటపడ్డ బాంబులను స్థలం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించామన్నారు.