రాజ్‌భవన్ పరిసరాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions At Raj Bhavan in Hyderabad, రాజ్‌భవన్ పరిసరాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలోని రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌవాన్ రాజ్‌భవన్‌లో ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా.. రాజ్‌భవన్ రోడ్డులో మోనప్ప ఐలాండ్ నుంచి వీవీ విగ్రహం జంక్షన్ వరకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి చాలా మంది ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా ఈ రూట్‌లో వెళ్లే వాహనాలను మరో రూట్‌లోకి మళ్లించి, రాజ్‌భవన్ రూట్, పంజాగుట్ట, రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డును నిర్ణీత సమయానికి మూసివేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *