పోలీసుల బంపరాఫర్.. హెల్మెట్ ఉంటే నో చెకింగ్!

భారీ ఫైన్ల ఎఫెక్ట్‌తో వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అన్ని పత్రాలు ఉన్నా.. ఏ రూపంలో ఫైన్ పడుతుందో అని వారు భయపడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో పోలీసులు ఓ బంపరాఫర్ ప్రకటించారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడిపితే ఇతర పత్రాల కోసం ఆపి తనిఖీలు చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. హెల్మెట్‌ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని, హెల్మెట్ వాడకాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేసేందుకే ఈ […]

పోలీసుల బంపరాఫర్.. హెల్మెట్ ఉంటే నో చెకింగ్!
Follow us

|

Updated on: Sep 14, 2019 | 7:47 PM

భారీ ఫైన్ల ఎఫెక్ట్‌తో వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అన్ని పత్రాలు ఉన్నా.. ఏ రూపంలో ఫైన్ పడుతుందో అని వారు భయపడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో పోలీసులు ఓ బంపరాఫర్ ప్రకటించారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడిపితే ఇతర పత్రాల కోసం ఆపి తనిఖీలు చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. హెల్మెట్‌ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని, హెల్మెట్ వాడకాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన వాహనదారులకు కొంతకాలం తనిఖీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. అయితే హెల్మెట్‌లను ధరించకుండా ప్రయాణించేవారిని మాత్రం ఉపేక్షించకుండా జరిమానాలు విధించాలని.. అంతేకాకుండా వాహనాలకు సంబంధించిన అన్ని డాక్యూమెంట్లను సైతం తనిఖీ చేయాలనీ పోలీసు అధికారులను ఆదేశించారు.

మరోవైపు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనల విషయంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాహనదారులకు చలాన్లు విధించకుండా నిబంధనలకు అనుగుణంగా వారికి ఉండాల్సిన వాహనపత్రాలను మంజూరు చేయిస్తామని ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు అన్నారు. ఉప్పల్‌ రింగ్‌రోడ్‌ వద్ద శనివారం వారి సిబ్బందితో కలిసి వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్‌ లేకుంటే అక్కడికక్కడే వాహనదారుని చేత కొనిపిస్తామన్నారు. వాహనదారులు అన్ని ట్రాఫిక్ నిబంధనలను పాటించి వాహనాన్ని నడిపితే  ప్రమాదాల బారిన పడకుండా ఉంటారన్నారు.