Traffic jam: ట్రాఫిక్‌ జామ్‌ అయిందని ఫిర్యాదు చేస్తే.. రెండు గంటల పాటు..!

Traffic jam: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నిరంతరం ఎదురయ్యే ట్రాఫిక్‌ ఇబ్బందులతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందని ఫిర్యాదు చేస్తే.. ‘మీరే కంట్రోల్‌ చేయండి’ అంటూ రెండు గంటలు ఆయనను ట్రాఫిక్‌ వాలంటీర్‌గా నియమించారు పోలీసులు. సోనో చౌహాన్ అనే వ్యక్తి మంగళవారం ఫిరోజాబాద్‌లోని సుభాష్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాడు. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో విసిగిపోయిన సోను నేరుగా […]

Traffic jam: ట్రాఫిక్‌ జామ్‌ అయిందని ఫిర్యాదు చేస్తే.. రెండు గంటల పాటు..!
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2020 | 3:17 PM

Traffic jam: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నిరంతరం ఎదురయ్యే ట్రాఫిక్‌ ఇబ్బందులతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందని ఫిర్యాదు చేస్తే.. ‘మీరే కంట్రోల్‌ చేయండి’ అంటూ రెండు గంటలు ఆయనను ట్రాఫిక్‌ వాలంటీర్‌గా నియమించారు పోలీసులు.

సోనో చౌహాన్ అనే వ్యక్తి మంగళవారం ఫిరోజాబాద్‌లోని సుభాష్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాడు. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో విసిగిపోయిన సోను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ ఆయనకు పోలీసుల నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ‘రెండు గంటల పాటు మీరే ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయండి’ అని సీనియర్‌ పోలీస్‌ అధికారి సచింద్ర పటేల్‌ సోనును కోరారు. అంతేగాక సోనును సర్కిల్‌ ఆఫీసర్‌ హోదాలో ట్రాఫిక్‌ వాలంటీర్‌గా నియమించారు.

సోను ట్రాఫిక్ సేఫ్టీ చొక్కా, హెల్మెట్ ధరించి రెండు గంటల పాటు ట్రాఫిక్‌ వాలంటీర్‌ విధులు నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనాలను ఆపి చలాన్లు కూడా ఇచ్చారు. సోను వెంట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌దత్త్‌ శర్మ కూడా ఉన్నారు. ‘ట్రాఫిక్‌ పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాం. సమస్యపై ప్రజలకు మరింత అవగాహన వస్తుంది’ అని శర్మ తెలిపారు.

కాగా.. సోను కూడా దీనిపై సానుకూలంగా స్పందించడం విశేషం. ‘దీనివల్ల ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల సమస్యలేంటో నాకు అర్థమైంది. మనం నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ అనుభవంతో ఇకపై నేను మరింత బాధ్యతగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!