ఇవాళ పాతబస్తీలో ట్రాఫిక్ అంక్షలు..!

కరోనా ప్రభావం అన్ని పండుగలపై పడుతుంది. హంగు ఆర్బాటలు లేకుండానే సాదాసీదాగా పండుగలు జరుపుకోవల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు పలు అంక్ష విధించారు.

 • Balaraju Goud
 • Publish Date - 8:18 am, Fri, 30 October 20

కరోనా ప్రభావం అన్ని పండుగలపై పడుతుంది. హంగు ఆర్బాటలు లేకుండానే సాదాసీదాగా పండుగలు జరుపుకోవల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు పలు అంక్ష విధించారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ప్రధానంగా పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌ నుంచి రాకపోకలు నిర్వహించే ఆర్టీసీ బస్సులను చాదర్‌ఘాట్‌, నల్గొండ క్రాస్‌ రోడ్‌ వైపు నుంచి అనుమతిస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ర్యాలీలో పాల్గొనదలచిన వాహనదారులు తమ వాహనాలను చార్మినార్‌ బస్‌ టర్మినల్‌లో పార్క్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

పాతబస్తీలో ట్రాఫిక్ అంక్షలు ఇలాః

 • శాలిబండ క్రాస్‌ రోడ్‌ నుంచి చార్మినార్‌ వైపు వాహనాలను ఖిల్వత్‌, నాగులచింత లేదా మొఘల్‌పురా వైపు మళ్లిస్తారు.
 • మోతిగల్లీ నుంచి చార్మినార్‌ వైపు వెళ్లే వాహనాలను మూసాబౌలి లేదా వాల్టా హోటల్‌ వైపు అనుమతి.
 • గుల్జార్‌హౌజ్‌ నుంచి చార్మినార్‌ వెళ్లే వాహనాలను మిట్టీకాషేర్‌, ఘాంసీబజార్‌ వైపు మళ్లింపు.
 • మిట్టీకాషేర్‌ నుంచి చార్మినార్‌ వైపు వెళ్లే వాహనాలను ఖిల్వత్‌ లేదా ఘాంసీబజార్‌ వైపు అనుమతి.
 • ర్యాలీ గుల్జార్‌హౌజ్‌ చేరిన తర్వాత మదీనా నుంచి చార్మినార్‌ వైపు వచ్చే వాహనాలను సిటీ కాలేజీ వైపు అనుమతి.
 • ర్యాలీ మదీనా చేరిన తర్వాత సిటీ కాలేజీ వైపు నుంచి వచ్చే వాహనాలను ఢిల్లీ గేటు వైపు అనుమతించకుండా బేగంబజార్‌, మూసాబౌలి వైపు అనుమతి.
 • ర్యాలీ మదీనా వద్ద ఉన్నప్పుడు అఫ్జల్‌గంజ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను నయాపుల్‌ వైపు అనుమతించకుండా శివాజీబ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి వైపు మళ్లిస్తారు.
 • ఢిల్లీ గేటు వద్దకు ర్యాలీ చేరినప్పుడు సాలార్‌జంగ్‌ రోటరీ వైపు నుంచి వచ్చే వాహనాలను నయాపుల్‌ వైపు అనుమతించకుండా శివాజీ బ్రిడ్జి, మీరాలంమండి వైపు అనుమతిస్తారు.
 • దారుల్‌షిఫా వద్దకు ర్యాలీ వచ్చిన సమయంలో డబీర్‌పురా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఏపీఏటీ వైపు అనుమతించకుండా మాతాకీ కిడికీ వైపు మళ్లిస్తారు.
 • ర్యాలీ ఏపీఏటీ వద్దకు చేరిన తర్వాత డబీర్‌పురా లేదా మాతాకి కిడికీ వైపు నుంచి వచ్చే వాహనాలను పురానీ హవేలీ, పీలీగేట్‌ వైపు అనుమతించకుండా ప్రత్యామ్నాయ రూట్‌లో అనుమతిస్తారు.
 • చత్తాబజార్‌ నుంచి టిప్పుఖాన్‌ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను మదీనా వైపు అనుమతిస్తారు.
 • ర్యాలీ ఎతెబార్‌ చౌక్‌ చేరిన తర్వాత బీబీ బజార్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మీరాలం మండి వైపు వెళ్లకుండా తలాబ్‌కట్టా, హాఫిజ్‌డంకా మసీదు, బీబీబజార్‌ వైపు అనుమతిస్తారు.
 • ర్యాలీ అలీజా కోట్ల వద్దకు చేరిన తర్వాత వాల్టాహోటల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను తలాబ్‌కట్ట, మొఘల్‌పురా వైపు మళ్లిస్తారు.
 • వాల్టాహోటల్‌, మొఘల్‌పురా వచ్చిన తర్వాత హరిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను సుల్తాన్‌షాహీ లేదా శాలిబండ వైపు మళ్లిస్తారు.