కరోనా ప్రభావం.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

కరోనా ప్రభావం కారణంగా సోమవారం దేశీయ మార్కెట్లు 10 శాతానికి పైగా నష్టాల్లో కొనసాగాయి. ఉదయం 111 గంటల 15 నిముషాల సమయంలో సెన్సెక్స్ 2,307.16 పాయింట్లు నష్టపోయి.. 27,608.80 పాయింట్ల వద్ద, నిఫ్టీ 842.45 పాయింట్లు నష్టపోయి 7,903 వద్ద కొనసాగాయి.

కరోనా ప్రభావం.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 23, 2020 | 12:31 PM

కరోనా ప్రభావం కారణంగా సోమవారం దేశీయ మార్కెట్లు 10 శాతానికి పైగా నష్టాల్లో కొనసాగాయి. ఉదయం 111 గంటల 15 నిముషాల సమయంలో సెన్సెక్స్ 2,307.16 పాయింట్లు నష్టపోయి.. 27,608.80 పాయింట్ల వద్ద, నిఫ్టీ 842.45 పాయింట్లు నష్టపోయి 7,903 వద్ద కొనసాగాయి. పదిన్నర గంటల సమయంలో సూచీలు పది శాతం పడిపోవడంతో.. ట్రేడింగ్ సుమారు 45 నిముషాలపాటు నిలిచిపోయింది. ఉదయం  ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 2,991 పాయింట్లు పతనమై 26,924 పాయింట్లకు, నిఫ్టీ 842 పాయింట్లు పతనమై 7,903 కి చేరింది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఏడు ట్రేడింగ్ సెషన్ల కాలంలో సోమవారం నాడు ట్రేడింగ్ నిలిచిపోవడం ఇది రెండో సారి. వరల్డ్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ప్రకారం దేశంలో ఎస్ బీ ఐ, హెచ్ డీ ఎఫ్ సి, ఐసీఐసీఐ బ్యాంకులతో సహా 12 సంస్థల స్టాక్ లు 12.74 శాతం డౌన్ అయ్యాయి.