చంద్రబాబు మెడకు ఇన్‌సైడర్ ఉచ్చు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉచ్చు బిగుసుకుంటోందా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. అమరావతి ఏరియాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ లోతైన దర్యాప్తునకు ఏపీ సీఐడి అధికారులు సిద్దమవుతున్నారు. రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ అంశం తెరమీదికి వచ్చినప్పట్నించి అమరావతి ఏరియాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు తెరమీదికి వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలుగుదేశం నేతలు మొత్తం నాలుగు వేల ఎకరాల మేరకు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు […]

చంద్రబాబు మెడకు ఇన్‌సైడర్ ఉచ్చు
Follow us

|

Updated on: Jan 18, 2020 | 5:10 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉచ్చు బిగుసుకుంటోందా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. అమరావతి ఏరియాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ లోతైన దర్యాప్తునకు ఏపీ సీఐడి అధికారులు సిద్దమవుతున్నారు.

రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ అంశం తెరమీదికి వచ్చినప్పట్నించి అమరావతి ఏరియాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు తెరమీదికి వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలుగుదేశం నేతలు మొత్తం నాలుగు వేల ఎకరాల మేరకు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని శాసనసభా వేదికగా ఆరోపించారు. ఆ తర్వాత వైసీపీ నేతలంతా కలిసి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఏ తెలుగు దేశం నేతల ఏ మేరకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేశారన్నది వెలుగులోకి తెచ్చారు.

అయితే, వైసీపీ ఆరోపణలపై టీడీపీ లీడర్లు గట్టిగా స్పందించారు. ఆరోపణలు నిరూపించాలంటూ సవాళ్ళు విసిరారు. తాజాగా ఆ పనిని ఏపీ సీఐడి టేకప్ చేసినట్లు సమాచారం అందుతోంది. అసైన్‌మెంటు భూములను గతంలో ఎవరి నుంచి ఎవరు కొనుగోలు చేశారు. అవి ఆ తర్వాత ఎవరెవరి చేతులు మారి, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో వున్నాయి? వాటిలో బినామీలెవరు? ఒరిజినల్ భూముల ఓనర్లు ఎవరు? ఇలాంటి అంశాలపై ఏపీ సీఐడి ప్రాథమిక సమాచారాన్ని సేకరించిందని తాజా సమాచారం.

ఏపీ సీఐడి సేకరించిన వివరాలతో చంద్రబాబు, నారా లోకేశ్‌లతో పాటు.. సుమారు 40 మంది వరకు తెలుగుదేశం నేతలపై త్వరలో కేసులు నమోదవుతాయని అంటున్నారు. అయితే, దీనికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఒక వైపు రాజధాని అంశంపై దూకుడును ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి… ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంతు చూడాలని భావిస్తున్నారని అమరావతి వర్గాల భోగట్టా.