మోదీ-మైక్ మధ్య భేటీ.. విభేదాలకిక స్వస్తి !

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బుధవారం ఢిల్లీలో కాలు మోపారు. ప్రధాని మోదీతో కొద్దిసేపు సమావేశమైన ఆయన.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తో విస్తృతంగా సంప్రదింపులు జరపనున్నారు. టెర్రరిజం, హెచ్-1 బీ వీసా, ట్రేడ్, రష్యాతో భారత్ ఆయుధ కొనుగోళ్లు, ఇరాన్ పై అమెరికా ఆంక్షలు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం వంటి వివిధ అంశాలపై ఆయన చర్చించనున్నారు. తాజా ఎన్నికల్లో మోదీ ఘన విజయం సాధించి ప్రధాని […]

మోదీ-మైక్ మధ్య భేటీ.. విభేదాలకిక స్వస్తి !
Follow us

|

Updated on: Jun 26, 2019 | 1:13 PM

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బుధవారం ఢిల్లీలో కాలు మోపారు. ప్రధాని మోదీతో కొద్దిసేపు సమావేశమైన ఆయన.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తో విస్తృతంగా సంప్రదింపులు జరపనున్నారు. టెర్రరిజం, హెచ్-1 బీ వీసా, ట్రేడ్, రష్యాతో భారత్ ఆయుధ కొనుగోళ్లు, ఇరాన్ పై అమెరికా ఆంక్షలు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం వంటి వివిధ అంశాలపై ఆయన చర్చించనున్నారు. తాజా ఎన్నికల్లో మోదీ ఘన విజయం సాధించి ప్రధాని అయ్యాక ఓ విదేశం నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇండియాను సందర్శించడం ఇదే మొదటిసారి. పాంపియో రాకతో అమెరికాతో భారత వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. మోదీతో పాంపియో భేటీ అయిన దృశ్యాలను ఆయన ట్వీట్ చేశారు. జపాన్ లోని ఒసాకాలో త్వరలో జరగనున్న జీ-20 సమ్మిట్ సందర్భంగా మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో మైక్ భారత సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ‘ హద్డులు చెరిగిపోవాలని తమ దేశం కోరుతోందని, అలాగే హెచ్-1 బీ వీసాల విషయంలో భారత అభ్యర్థనలను తాము పరిగణనలోకి తీసుకుంటామని మైక్ ఈ చర్చల్లో స్పష్టం చేసే అవకాశం ఉంది. అటు-జ్జయశంకర్, మైక్ మధ్య చర్చలకు అజెండా అంటూ ఏదీ లేదని దౌత్య వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ఇండియా ఎస్-400 మిసైల్ సిస్టం లను కొనుగోలు చేసేందుకు 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయాన్ని పాంపియో ఢిల్లీ నేతలతో జరిపే చర్చల్లో ప్రస్తావించవచ్చు. అదే సమయంలో భారత వైఖరిని కూడా జయశంకర్ ఆయనకు వివరించే సూచనలున్నాయి. ఇటీవలి కాలంలో అమెరికా-భారత్ మధ్య ‘ టారిఫ్ వార్ ‘ కొనసాగుతోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారత్ సుంకాలు పెంచడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియాను ఆయన ‘ టారిఫ్ కింగ్ ‘ అని ఆ మధ్య అభివర్ణించారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?