యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరుబాట

TPCC Fight Against Uranium Mining and VH Becomes Commitee Chairman, యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరుబాట

యురేనియం తవ్వకాలపై పోరు ఉధృతమవుతోంది. ఓ వైపు ఇప్పటికే ప్రతిపక్షాలు దీనిపై యుద్ధానికి సిద్ధమవుతుండగా.. మరోవైపు సెలబ్రిటీల నుంచి కూడా సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియా వేదికగా పోరు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్.. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా.. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను ఛైర్మన్‌గా నియమిస్తూ.. ఉద్యమానికి 16 మంది సభ్యులతో కూడిన కమిటీ వేసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. యురేనియం తవ్వకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నెల 16వ తేదీన యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వీహెచ్ వెల్లడించారు. యురేనియం తవ్వకాలపై పోరాటం చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు. న్యూ క్లియర్ పవర్ పెంచుకునేందుకు యురేనియం అవసరమన్న నేపథ్యంలో.. బయటినుంచి దిగుమతి చేసుకోవచ్చని.. కానీ అడవులను ధ్వంసం చేసి యురేనియం తీస్తే.. మళ్లీ అడవులు పోతే తిరిగి రావని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *