కేంద్రం ఒక్కరూపాయి తెలంగాణకు ఇవ్వలేదు, బీజేపీ పెద్దలు అర్ధరాత్రి దొంగల్లా తమ పార్టీ నేతల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు: ఉత్తమ్

ఇప్పటివరకు కేంద్రం ఒక్కరూపాయి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. ఐటీ రీజియన్‌ రద్దయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, లక్ష్మణ్ అడగలేదని విమర్శించారు. ఇవన్నీ తెలియని బీజేపీ నేతలు అర్ధరాత్రి దొంగల్లా తమ పార్టీ నాయకుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకు లేదన్నారు. పార్లమెంట్‌లో అన్ని విషయాల్లో బీజేపీకు టీఆర్ఎస్ మద్దతు పలికిందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీకు మద్దతు పలికేందుకు […]

  • Venkata Narayana
  • Publish Date - 8:30 pm, Sun, 22 November 20

ఇప్పటివరకు కేంద్రం ఒక్కరూపాయి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. ఐటీ రీజియన్‌ రద్దయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, లక్ష్మణ్ అడగలేదని విమర్శించారు. ఇవన్నీ తెలియని బీజేపీ నేతలు అర్ధరాత్రి దొంగల్లా తమ పార్టీ నాయకుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకు లేదన్నారు. పార్లమెంట్‌లో అన్ని విషయాల్లో బీజేపీకు టీఆర్ఎస్ మద్దతు పలికిందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీకు మద్దతు పలికేందుకు ఎంఐఎం రాజకీయాలు చేస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.