‘పోలీసుల తీరు బాలేదు’

అధికారపార్టీ .. ప్రతిపక్షాల్ని అణగదొక్కాలని చూస్తుందనటం కామన్. అయితే, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం వేరే యాంగిల్ టచ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని విమర్శించారు...

'పోలీసుల తీరు బాలేదు'
Follow us

|

Updated on: Sep 06, 2020 | 2:18 PM

అధికారపార్టీ .. ప్రతిపక్షాల్ని అణగదొక్కాలని చూస్తుందనటం కామన్. అయితే, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం వేరే యాంగిల్ టచ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని విమర్శించారు. అధికారపక్షానికి వత్తాసు పలుకుతూ వన్‌సైడెడ్‌‌గా పని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షనేతలు అక్రమాలపై ఎదురు మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పోలీసుల తీరుపైనా.. కాంగ్రెస్ బలోపేతం మీద మాట్లాడారు. తెలంగాణ లోని ఆయా జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు అంశాల వారీగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి కాంగ్రెస్ శ్రేణులంతా సిద్ధం కావాలన్నారు. గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలన్నీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. వాళ్లంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని.. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనన్న ఆయన.. తాను నిరంతరం అండగా అందుబాటులో ఉంటానని.. కొట్లాడుదాం.. గుర్తింపు తెచుకుందాం.. పార్టీని మరింత బలోపేతం చేద్దాం అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభయమిచ్చారు ఉత్తమ్.