Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

టాక్సిక్ ఆసిడ్స్ ప్రభావంతో సికింద్రాబాద్ జీవనం నరకం!

Toxic lakes: Secunderabad turns up its nose, టాక్సిక్ ఆసిడ్స్ ప్రభావంతో సికింద్రాబాద్ జీవనం నరకం!

కాప్రా, హుస్సేన్ సాగర్ చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. కాప్రా చెరువులోకి ఎగువ ప్రాంతంలోని మురుగు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనలతో  జలాలు విషపూరితంగా మారుతున్నాయి. కాప్రా, నాగారం ప్రాంతంలోని మురుగునీరు, చర్లపల్లి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లోని రసాయనాలు ఈ చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ చెరువు పూర్తిగా కలుషితమైంది. చెరువులోని నీటిని చేతితో తాకలేని పరిస్థితి. చెరువు పరిసర ప్రాంతంలోకి ప్రవేశించగానే ముక్కు పుటాలు అదిరేంత దుర్వాసన వెలువడుతోంది. ఈ చెరువు నిరంతరం మురుగునీటితో నిండి ఉంటుంది. ఒకప్పుడు తాగునీరు అందించిన చెరువు నీరు నలుపు రంగులోకి మారింది. ఆ నీటిని మూగ జీవాలు తాగినా మృతి చెందే పరిస్థితి నెలకొంది. చెరువంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంది.

వర్షాకాలం వస్తే చాలు కీసర మండలంలోని 10 గ్రామాల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడాల్సిందే. చెరువులోని నీరంతా కూడా కాలనీల్లో చేరడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చెరువులన్నీ కలుషితం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు దోమల బెదడ అధికమైంది. దోమల ప్రభావంతో చెరువు సమీప ప్రాంత ప్రజలు తరచూ అంటు వ్యాధుల బారిన పడుతున్నారు. చెరువులోకి మురుగునీరు రాకుండా ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేయాలి. చెరువులోకి కేవలం వర్షపు నీరు వచ్చి చేరేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరుతో పాటు పెద్ద మొత్తంలో చెత్తా చెదారం వచ్చి చేరుతోంది. తీరంలోనే పేరుకుపోయిన చెత్తా చెదారం కుళ్లిపోయి ఎండా కాలంలో భరించలేని దుర్వాసన వస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా అక్కడ చేపట్టిన చర్యలు శూన్యం. ముఖ్యంగా వేసవిలో సెలవులు ఉండడంతో నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలోనే సందర్శకులు కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేస్తుంటారు. సందర్శకుల తాకిడితో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా, పర్యాటకులకు హాయిగా ఉండేలా ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు.