ఆగష్టు 1 నుంచి విశాఖ జిల్లాలో తెరుచుకోనున్న పర్యాటక ప్రదేశాలు

కరోనా నేపథ్యంలో గత 4 నెలలుగా పర్యాటకం మూత పడిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాలకు కోట్లలో నష్టం వాటిల్లింది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభం అవుతుండగా..

ఆగష్టు 1 నుంచి విశాఖ జిల్లాలో తెరుచుకోనున్న పర్యాటక ప్రదేశాలు
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 5:37 PM

కరోనా నేపథ్యంలో గత 4 నెలలుగా పర్యాటకం మూత పడిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాలకు కోట్లలో నష్టం వాటిల్లింది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభం అవుతుండగా.. పర్యాటక రంగం కూడా ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ ఆగష్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నట్లు పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలను ఆగష్టు 1 నుంచి ప్రారంభిస్తామని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డివిజనల్ మేనేజర్‌ టీజీ ప్రసాద్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా అన్ని ప్రదేశాల్లో కరోనా నిబంధనలను పాటిస్తామని ఆయన అన్నారు. ఈ క్రమంలో బుర్రా గుహలలో ఇదివరకు గంటకు 1000 మంది పర్యాటకులకు అనుమతిని ఇస్తుండగా.. ఇకపై 300 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని అన్నారు. దీనికి సంబంధించి టికెట్లు కొనే సమయంలోనే సందర్శించాల్సిన సమయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల్లోకి రావాలంటే ఫేస్‌ మాస్క్ తప్పనిసరి అని.. శానిటైజర్స్‌, డిస్పోజల్ గ్లౌజ్‌లు తాము అందిస్తామని వివరించారు. అలాగే పర్యాటకుల ఉష్ణోగ్రతలను చెక్‌ చేయడంతో పాటు డిజిటల్ ట్రాన్సాక్షన్‌లను ప్రోత్సహిస్తామని ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇక బోటింగ్ విధానంలోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!