సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడంటే..?

రెండేళ్ల క్రితం.. అంటే 2017 లో వచ్చిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూడలేకపోయినవారికి మరో ఛాన్స్ ! ఈ ఏడాది జులై 2 న ఇది సంభవించనుంది. ఆ రోజున ఈ గ్రహణం 4 నిముషాల 33 సెకండ్ల పాటు కనబడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే ‘ లైన్ ‘ గా ఒక చోట చేరినప్పుడు… చంద్రుడు పూర్తిగా సూర్యుడ్ని కప్పివేసే సమయమది ! ఆ కాసేపూ ఒక్కసారిగా పగలు చీకటిగా […]

సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడంటే..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 06, 2019 | 3:56 PM

రెండేళ్ల క్రితం.. అంటే 2017 లో వచ్చిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూడలేకపోయినవారికి మరో ఛాన్స్ ! ఈ ఏడాది జులై 2 న ఇది సంభవించనుంది. ఆ రోజున ఈ గ్రహణం 4 నిముషాల 33 సెకండ్ల పాటు కనబడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే ‘ లైన్ ‘ గా ఒక చోట చేరినప్పుడు… చంద్రుడు పూర్తిగా సూర్యుడ్ని కప్పివేసే సమయమది ! ఆ కాసేపూ ఒక్కసారిగా పగలు చీకటిగా మారిపోతుంది. తొలి గ్రహణం దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లోని ఓనో ద్వీపంలో స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటల 24 నిముషాలకు కనబడి ఆ తరువాత మెల్లగా ఆగ్నేయ దిశకు మారుతుందట. అయితే ఈ సూర్యగ్రహణం ఈ సారి ఇండియాలో కనబడదని, వాతావరణ మార్పుల రీత్యా ఆ రోజు రాత్రి అవుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఈ సారి ఈ గ్రహణాన్ని చూడలేకపోతే వచ్ఛే ఏడాది డిసెంబరులో చూడవచ్ఛు .