యానాంలో కనువిందు చేసిన టోర్నడో

టోర్నడోలు మనకు పెద్దగా తెలియవు. అమెరికాలో ఎక్కువగా అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలు మన దగ్గర ఈ మధ్యే కనిపిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఈ  అద్భుతం...

యానాంలో కనువిందు చేసిన టోర్నడో
Follow us

|

Updated on: Jul 17, 2020 | 3:53 PM

Tornodo Seen Near Yanam : టోర్నడోలు మనకు పెద్దగా తెలియవు. అమెరికాలో ఎక్కువగా అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలు మన దగ్గర ఈ మధ్యే కనిపిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఈ  అద్భుతం ఆవిష్కృతమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సమీపంలో కనిపించిన అద్భుత దృశ్యం కనువిందు చేసింది.

అయితే కేంద్రపాలిత ప్రాంతమైన యానాం, ఫరంపేట, న్యూ రాజీవ్ నగర్ ప్రాంతంలో భూమి మీద పెద్ద గాలి దుమారం టోర్నడోగా మారింది. ఆకాశంతో భూమి కలిసిపోయిందా అన్నట్లుగా ఆ దృశ్యం కనిపించింది. అమెరికాలో ఎక్కువగా కనబడే టోర్నడోలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుండటంతో కొంత ఆందోళన కలిగించినా.. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ సెల్ ఫోన్‌లో బంధించారు.

గత నెలలో కూడా బైరావపాలెం సముద్ర తీరంలో టోర్నడో అద్భుతాలను చిత్రీకరించారు మత్స్యకారులు. సముద్రం నుంచి నీరు ఆకాశంలోకి వెళుతున్నట్టు కనిపించిన ఈ టోర్నడోను కొందరు మత్స్యకారులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర సముద్రంలో ఈ అరుదైన దృశ్యం కనిపించిన సంగతి తెలిసిందే.