ఐపీఎల్ 2020 : భారత్ ప్లేయర్స్ మరీ ఇంత చీపా..?

క్రికెట్ ప్రేమికులకు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ 13వ సీజన్ హంగామా షురూ కానుంది. ఈ నెల 19న కోల్‌కతాలో జరగనున్న ఆక్షన్‌లో మొత్తంగా 332 మంది ప్లేయర్స్ పోటీపడనున్నారు. అంతేకాకుండా ఆటగాళ్ల ధరలను కూడా ఫిక్స్ చేస్తూ బీసీసీఐ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇకపోతే వేలం ముందుగా బ్యాట్స్‌మెన్‌తో మొదలై.. ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు, పేసర్లు, స్పిన్నర్లతో ముగిస్తుంది. కాగా, విండీస్ బౌలర్ విలియమ్స్, ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా, బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్కికర్ రహీం […]

ఐపీఎల్ 2020 : భారత్ ప్లేయర్స్ మరీ ఇంత చీపా..?
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 1:24 AM

క్రికెట్ ప్రేమికులకు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ 13వ సీజన్ హంగామా షురూ కానుంది. ఈ నెల 19న కోల్‌కతాలో జరగనున్న ఆక్షన్‌లో మొత్తంగా 332 మంది ప్లేయర్స్ పోటీపడనున్నారు. అంతేకాకుండా ఆటగాళ్ల ధరలను కూడా ఫిక్స్ చేస్తూ బీసీసీఐ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇకపోతే వేలం ముందుగా బ్యాట్స్‌మెన్‌తో మొదలై.. ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు, పేసర్లు, స్పిన్నర్లతో ముగిస్తుంది. కాగా, విండీస్ బౌలర్ విలియమ్స్, ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా, బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్కికర్ రహీం ఈ వేలం లిస్టులో కొత్తగా చేరారు.

క్యాప్డ్ ప్లేయర్స్‌లో రూ.2 కోట్ల ధరలో 7 మంది ఆటగాళ్లు  ఉండగా.. రూ.1.5 కోట్ల ధరలో 10 మంది, రూ. కోటి ధరకు 23 మంది, రూ. 75 లక్షల ధరకు 16 మంది, రూ. 50 లక్షల్లో 78 మంది ఉన్నారు. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌లో 40 లక్షల్లో 7 మంది, రూ. 30 లక్షల్లో 8 మంది, 20 లక్షల్లో 183 మంది ఆటగాళ్లు ఉన్నారు. భారత్ ప్లేయర్స్ విషయానికి వస్తే రాబిన్ ఉతప్ప రూ.1.5 కోట్లు, జయదేవ్ ఉనద్కట్ రూ.1 కోటి రూపాయల వేల పలుకుతున్నారు. అంతేకాక ఇండియన్ ప్లేయర్స్ సగానికి పైగా తక్కువ ధరకే వేలంలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఫ్రాంచైజీలు కూడా హార్డ్ హిట్టర్స్ కోసమే వేలానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. మరోవైపు అన్ని సీజన్ల మాదిరిగానే ఈ 13వ ఎడిషన్ కూడా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోనుంది. ఇక ఈ సీజన్‌లో 8 జట్లతో పాటుగా మరో రెండు ఫ్రాంచైజీ జట్లు యాడ్ అవుతాయని తెలుస్తోంది. గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్, జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్, డేల్ స్టయిన్, మోర్గాన్, జాసన్ రాయ్, క్రిస్ లిన్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు మొదటి సెట్ వేలంలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?