ఇస్రో సైంటిస్ట్ అద్భుత వేణుగానం.. మైమరచిన కాంగ్రెస్ ఎంపీ జైరాం

ఉపగ్రహాలను, రాకెట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడమే గాక,, ఇటీవలి చంద్రయాన్-2 మిషన్ తో మరింతగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ‘ ఇస్రో ‘ లో..వాద్య సంగీతంతో జనాలను ఆకట్టుకోగలిగే అద్భుతమైన ఓ ఆర్టిస్టు కూడా ఉన్నారు. బెంగుళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ అయిన పి. కున్హికృష్ణన్ మంచి వేణుగాన విద్వాంసుడు కూడా.. సోమవారం బెంగుళూరులో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిశాక.. ఆయన తన వేణువుతో ‘ వాతాపి గణపతిమ్ భజే […]

ఇస్రో సైంటిస్ట్ అద్భుత వేణుగానం.. మైమరచిన కాంగ్రెస్ ఎంపీ జైరాం
Follow us

|

Updated on: Dec 31, 2019 | 2:00 PM

ఉపగ్రహాలను, రాకెట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడమే గాక,, ఇటీవలి చంద్రయాన్-2 మిషన్ తో మరింతగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ‘ ఇస్రో ‘ లో..వాద్య సంగీతంతో జనాలను ఆకట్టుకోగలిగే అద్భుతమైన ఓ ఆర్టిస్టు కూడా ఉన్నారు. బెంగుళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ అయిన పి. కున్హికృష్ణన్ మంచి వేణుగాన విద్వాంసుడు కూడా.. సోమవారం బెంగుళూరులో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిశాక.. ఆయన తన వేణువుతో ‘ వాతాపి గణపతిమ్ భజే ‘ అనే కీర్తనను వాయించి అందరి ప్రశంసలు పొందారు.

ఈ కమిటీ సభ్యుడైన రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్.. తన ట్విటర్లో.. కున్హికృష్ణన్ వేణుగానానికి పరవశించి ఆ స్నిపెట్ ని పోస్ట్ చేశారు. ఈ ప్రొఫెషనల్ ఫ్లూట్ ప్లేయర్, కమ్ సైంటిస్టుని అభినందించారు. ఈ సమావేశంలో ఇస్రో చైర్మన్ కె. శివన్ కూడా పాల్గొన్నారు. ఒక పొలిటికల్ ‘ ఈవెంట్ ‘ లో ఓ ‘ మ్యూజికల్ పర్ఫామెన్స్ ‘ చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి..