నవ్వు.. నవ్వించు.. ఆరోగ్యానికి అదే బెస్ట్..

నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దలు అంటారు. కానీ నవ్వు నలభై విధాల గ్రేట్ అని ఇప్పటి వారు అంటున్నారు. నిజమే నవ్వడం కూడా ఒక మంచి అలవాటే. అలా అని ఊరికే నవ్వితే పిచ్చివారి కింద ట్రీట్ చేస్తుంది సమాజం. కానీ నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్ని బాధలున్నా కొద్దిగా చిరునవ్వు నవ్వితే.. వచ్చే ఆ ప్రశాంతత అంతా ఇంతా కాదు. అందుకే.. నవ్వడం ఓ భోగం.. నవ్వించడం ఓ యోగం.. నవ్వకపోవడం రోగం అని అంటారు. కానీ ప్రస్తుత బిజీ లైఫ్‌లో నవ్వుతూ గడపడమనేది కష్టంగా మారిపోయింది. ఇంట్లో, ఆఫీస్‌లో ఎన్నో టెన్షన్స్‌తో జీవితం గడిపేస్తున్నారు. దీంతో ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

అయితే బాధపడాల్సిన విషయమేంటంటే.. ఖర్చుపెట్టని నవ్వుని కూడా మనం కొనాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాం. మనసులో ఎన్నో పెట్టుకుని ఎదుటివారిని చూడగానే ముఖం తిప్పుకోవడం.. వీరితో మనకేంటంటూ బతికేస్తున్నాం. దీంతో లాఫింగ్ క్లబ్స్‌ వెలిశాయి. జోకులు పేల్చుకుంటూ.. సరదాగా గడిపేస్తున్నారు.

అయితే ఇలా నవ్వడం ద్వారా పలు ఆరోగ్యసమస్యలను దూరం చేయొచ్చంటున్నారు వైద్యనిపుణులు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్త నవ్వితే.. ఆ ఒత్తిడిని జయించవచ్చంటున్నారు వైద్యులు. అంతేకాదు.. ఒత్తిడి కారణంగా వచ్చే బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధింత సమస్యలను సులువుగా ఎదుర్కొనవచ్చని చెబుతున్నారు. మొత్తానికి నవ్వడం ద్వారా ఇన్ని రకాల ఆరోగ్యసమస్యలను ఎదుర్కొనవచ్చన్నమాట. అది కూడా ఉచితంగానే. ఇంకేంటి.. నవ్వడంలో పిసినారితనం చూపకుండా..హాయిగా నవ్వేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *