New Year 2021: కొత్త సంవత్సరం కోసం సరికొత్త వంటకాలు.. ఈసారి వీటితో సంబరాలను చేసుకుందాం..

ఈ కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా మలచుకుందాం. కొత్త ఆనందాన్ని.. కొత్త కొత్త వంటలతో ఈసారి ట్రై చేద్దాం. న్యూఇయర్ కోసం స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ?..

New Year 2021: కొత్త సంవత్సరం కోసం సరికొత్త వంటకాలు.. ఈసారి వీటితో సంబరాలను చేసుకుందాం..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 3:47 PM

ఈ కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా మలచుకుందాం. కొత్త ఆనందాన్ని.. కొత్త కొత్త వంటలతో ఈసారి ట్రై చేద్దాం. న్యూఇయర్ కోసం స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ?..

వెనిలా కప్ కేక్స్.. ఇందుకు కావాల్సినవి.. ఉప్పు- 2 కప్పులు, బటర్- పావుకప్పు, పంచదార పొడి-పావు కప్పు, వెనిలా ఎసెన్స్-టీ స్పూన్, కండెన్స్‏డ్ మిల్క్-అరకప్పు, బేకింగ్ పౌడర్-టీస్పూన్, మైదా పిండి-కప్పు, సోడా- అరకప్పు, చెర్రీస్-20

తయారీ విధానం.. కుక్కర్‏లో రెండు కప్పుల ఉప్పు వేసి దాని మీద ఒక స్టాండ్ వేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఉంచాలి. మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్‌డ్‌ మిల్క్‌ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ∙ఒక పాత్రలో బేకింగ్‌ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్‌ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి ∙సోడా (క్లబ్‌ సోడా వంటివి) వేసి బాగా కలపాలి ∙కప్‌ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి (విజిల్‌ పెట్టకూడదు) సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి చల్లారిన తర్వాత బయటకు తీసి అందించాలి.

చాకొలేట్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు.. పాలు – ఒకటిన్నర లీటర్లు, పంచదార – ఒక కప్పు, పటిక లేదా నిమ్మ రసం – కొద్దిగా, కోకో పొడి – అర కప్పు, జీడి పప్పు తరుగు – 2 స్పూన్స్, బాదం పప్పుల తరుగు – టీస్పూన్

తయారీ విధానం.. ముందుగా ఒక పాత్రలో ఒకటిన్నర లీటర్ల పాలు, ఒక కప్పు పంచదార వేసి బాగా కలపాలి. పాలు సగం వచ్చాక పటిక, నిమ్మ రసం కలిపి పాలు బాగా చిక్కబడి ముద్దలా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. పావు కప్పు కోకో పొడి, రెండు స్పూన్ల జీడిపప్పు పలుకులు జత చేసి, మంట పెంచి, ఆపకుండా బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక దించాలి. ఆ తర్వాత అల్యూమినియం పాత్రకి నెయ్యి పూసి, తయారైన చాకొలేట్‌ మిశ్రమాన్ని అంగుళం మందంలో సమానంగా పరిచి, అప్పడాల కర్రతో జాగ్రత్తగా ఒత్తి, చాకుతో కట్‌ చేయాలి. అనంతరం జీడిపప్పు, బాదం తరుగులతో సర్వ్ చేసుకోవాలి.

ఆల్మండ్ చాక్లెట్.. కావాల్సినవి.. డార్క్ చాకొలేట్-కప్పు, గ్రౌండ్ బాదం-కప్పు

తయారీ విధానం.. ముందుగా డార్క్ చాకొలేట్స్‏ని తీసుకోని 30 సెకన్ల వరకు కరిగించి బాగా తిప్పుతూ ఉండాలి. అలాగే ఇంకో 30 సెకన్ల వరకు కరిగించుకొని కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక గిన్నెను తీసుకోని అందులో కరిగించిన డార్క్ చాక్లెట్‏ను వేసుకోవాలి. అందులో వేయించిన బాదం పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ పదార్థలు మొత్తం కలిసేలా చూసుకోవాలి. ఆ తర్వాత చాక్లెట్ అచ్చు ట్రేని తీసుకొని అందులో ఈ చాక్లెట్ మిక్స్‏ని వేసుకోవాలి. ఈ తర్వాత ఈ పేస్ట్‏ను సమానంగా చేసి 10 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. అంతే ఆల్మండ్ కేక్ కుకీస్ రెడి అయిపోతుంది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..