టాప్ 10 న్యూస్ @ 9AM

  1. నోటీసులు ఇవ్వకుండా.. సస్పెండ్ చేయడం పై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. సమ్మె చేస్తున్న వారు ఉద్యోగులే కాదని ప్రభుత్వం అంటోంది. నాలుగో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేపట్టిన.. Read More 2.కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి.. రాజరాజేశ్వరీదేవి అవతారంలో దుర్గమ్మ శరన్నవరాత్ర ఉత్సవాలు చివరి రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ […]

టాప్ 10 న్యూస్ @ 9AM
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 9:00 AM

1. నోటీసులు ఇవ్వకుండా.. సస్పెండ్ చేయడం పై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం

ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. సమ్మె చేస్తున్న వారు ఉద్యోగులే కాదని ప్రభుత్వం అంటోంది. నాలుగో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేపట్టిన.. Read More

2.కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి.. రాజరాజేశ్వరీదేవి అవతారంలో దుర్గమ్మ

శరన్నవరాత్ర ఉత్సవాలు చివరి రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోంది. విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి లోకానికి.. Read More

3.బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో ముగ్గురు మొనగాళ్లు!

బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘సేఫ్ పార్కింగ్’ అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా కేటాయించిన.. Read More

4.నో చిన్న సినిమాలు.. ఓన్లీ బిగ్ ఫిలిమ్స్!

‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు మారుతి. ఈ చిత్రం తర్వాత వరుసగా చిన్న సినిమాలు తీసి బంపర్ హిట్స్ కొడుతూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. మారుతి తన సొంత నిర్మాణ సంస్థ మారుతి.. Read More

5.ఎయిర్ పోర్టు సిబ్బందిపై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఎందుకంటే?

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఇక రెండో టెస్ట్ కోసం.. Read More

6.గంభీర్ కెరీర్‌ను నేనే ముగించా.. పాక్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కెరీర్‌పై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్‌కు గంభీర్ భయపడేవాడని.. అందువల్లే అతని టీ20, వన్డేల కెరీర్ ముగిసిందని అన్నాడు. 2012లో భారత్- పాకిస్థాన్.. Read More

7.నెట్టింట్లో మూడు భారీ పోస్టర్లు.. అదిరిపోయింది ఎవరిదంటే.?

ముగ్గురు స్టార్ హీరోలు.. మూడు బడా సినిమాలు.. అన్నీ కూడా సంక్రాంతి రిలీజ్‌లు.. దసరా పండుగ సందర్భంగా ఈ స్టార్లు తమ ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ ఇచ్చారు. సరికొత్త లుక్స్‌లో పోస్టర్లు విడుదల చేసి.. విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘అల వైకుంఠపురంలో’.. Read More

8.స్విస్ ఖాతాల వివరాలు వచ్చేశాయి.. మోదీ నెక్స్ట్ ప్లానేంటి?

బడాబాబులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి తెప్పిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో ధనాన్ని దాచుకున్న భారతీయుల ఖాతాల తొలి విడత వివరాలు వచ్చేశాయి. ఎప్పటికప్పుడు.. Read More

9.ఆర్టీసీని మూడు రకాలుగా విభజన.. కేసీఆర్ సంచలన నిర్ణయం!

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం మరోసారి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సునీల్ శర్మ కమిటీ నివేదికపై సుమారు 4 గంటలు చర్చించిన ఆయన.. ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి.. Read More

10.రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ.. చీఫ్ జస్టిస్‌కు విజయసాయి లేఖ!

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆస్తులుపై ఈడీ విచారణ, స్కామ్‌లపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్‌కు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్‌తో.. Read More