Breaking News
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.
  • టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి భూకబ్జా, కేసుల చిట్టా. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.
  • గోపన్‌పల్లి భూవివాదంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ . కొండల్‌రెడ్డితో అప్పటి తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి కుమ్మక్కయ్యారు. గోపన్‌పల్లి భూ వివాదంలో అప్పటి తహశీల్దార్‌ అవకతవకలకు పాల్పడ్డారు. కొండల్‌రెడ్డికి సంబంధం లేని భూమిని శ్రీనివాస్‌రెడ్డి మ్యుటేషన్‌ చేయించారు. -టీవీ9తో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌. డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి తన అధికారాలకు విరుద్ధంగా.. రికార్డుల్లో లేనివ్యక్తి భూమిని కొండల్‌రెడ్డికి మ్యుటేషన్ చేయించారు. ఈ వివాదంలో మరో ఇద్దరు తహశీల్దార్ల పాత్ర కూడా గుర్తించాం. తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి లేఖ రాశాం-టీవీ9తో రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్.
  • గోపన్‌పల్లి భూవివాదంలో గతంలోనే రేవంత్‌రెడ్డిపై కేసులు. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.

టాప్ 10 న్యూస్ @ 9 AM

Top 10 news of the day, టాప్ 10 న్యూస్ @ 9 AM

1.ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్.. సర్వం సిద్ధం..
తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ చివరి సారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేశారు.. Read More

2.జేసీ మళ్లీ యూటర్న్.. జగన్‌‌పై ఓరేంజ్‌లో విసుర్లు
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరిని పొగుడుతారో..? ఎప్పుడు ఎవరిని తిడతారో తెలుసుకోవడం చాలా కష్టం. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై అంతెత్తున లేచే దివాకర్ రెడ్డి.. Read More

3.13వ రోజుకు చేరిన ఆర్టీసీ స్ట్రైక్.. కేసీఆర్ కీలక నిర్ణయం
ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కోర్టు చెప్పినా.. కార్మికులు పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. Read More

4.మద్యంతో కిక్కు.. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తుల వెల్లువ..
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన వస్తోంది. బుధవారంలో దరఖాస్తులకు గడువు ముగిసింది. కాగా, 2,216 మద్యం షాపులకు ఇప్పటివరకు 41 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.. Read More

5.వారి వల్లే ఇదంతా.. మన్మోహన్‌, రాజన్‌లపై నిర్మలా సంచలన ఆరోపణలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన స్థితికి చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు… Read More

6.కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. వ్యాపారి, కార్మికుడు మృతి
కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని త్రెంజ్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7.30గంటల సమయంలో యాపిల్ పండ్ల వ్యాపారులు చరణ్ జిత్ సింగ్, సంజీవ్‌పై కాల్పులు జరిపారు.. Read More

7.“భారతరత్న” కాంగ్రెస్ కుటుంబానికేనా..? సావర్కర్‌ దేశ భక్తుడు కాదా..?
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అందుకు కారణం బీజేపీ మెనిఫెస్టో. ఈ సారి కమలదళం మెనిఫెస్టోలో వీరసావర్కర్‌కు.. Read More

8.ఢిల్లీ కోర్టు మెట్లెక్కిన 13 రామచిలుకలు.. అసలు కథేంటంటే..?
బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పదమూడు రామచిలుకలను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. రామచిలుకలు ఏం నేరం చేశాయి..Read More

9.నిఘా వర్గాల హెచ్చరికలు.. ఎయిర్‌బేస్‌ల వద్ద ఆరెంజ్ అలర్ట్
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఏలాగైనా భారత్‌లో అలజడి సృష్టించాలనుకుంటున్న పాక్.. అనేక కుట్రలు పన్నుతోంది.. Read More

10.అభిమానులకు ఆ విషయం చెప్తూ.. సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రేణూ
టాలీవుడ్ నటి, రేణూ దేశాయ్.. తన సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.. Read More

Related Tags