Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @ 5PM

1. మెగా దంపతులకు సాదరంగా వెల్‌కమ్ చెప్పిన జగన్..!

ఏపీ సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి.. భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌.. Read more

2. రేపటి నుంచి ‘రైతులకు మహార్దశ’.. ఎందుకంటే..?

ఏపీ సర్కార్‌.. రైతులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు వైసీపీ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతులకు మరో వెయ్యి అందనంగా అంటే.. మొత్తం ఇప్పుడు.. Read more

3. కోడెల ఆత్మహత్య కేసు వేగవంతం… కీలక విషయాలు తెలిపిన శివరాం!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఆదివారం గుంటూరు చేరుకున్న పోలీసులు కోడెల శివరాంని పిలిపించి కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు.. Read more

4. తెలంగాణ బంద్‌కు జనసేన మద్దతు: పవన్ కళ్యాణ్

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈ నెల 19 వ తేదీన తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్  కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ.. Read more

5. పరిష్కారం దిశగా ఆర్టీసీ సమ్మె..!

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సమ్మెను పరిష్కరించాల్సిందిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు కేకేకు సూచించినట్టు సమాచారం. ఈ విషయంలో ఆయన చొరవ తీసుకోవాలని కేసీఆర్.. Read more

6. ఆ ఆహారంతో జాగ్రత్త.. తింటే కాన్సర్ రావొచ్చు!

కాన్సర్ ప్రాణాంతకరమైన వ్యాది అనేది అందరికి తెలిసిందే. పొగ తాగడం, మద్యం సేవించడం, జీవన శైలి, వ్యాయామాలు చేయకపోవడం వంటి వాటితో పాటుగా, కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల కూడా కాన్సర్ రావొచ్చని.. Read more

7. భారతసంతతి ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీకి నోబెల్

ఆర్థిక‌శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ 2019 నోబెల్ ప్రైజ్‌ ముగ్గురికి లభించింది. అభిజిత్ బెన‌ర్జీ, ఈస్త‌ర్ డుఫ్లో, మైఖేల్ క్రీమ‌ర్‌ ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేద‌రికాన్ని నిర్మూలించేందుకు.. Read more

8. సోనియా ఓ “చచ్చిన ఎలుక”.. బీజేపీ సీఎం నోటి దురుసు

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హర్యానా సీఎం మనోహార్‌లాల్ ఖట్టర్.. మరోసారి తన నోటి దురుసుతనం బయట పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా.. Read more

9. కమలం గుర్తు మీట నొక్కారా.. పాక్‌పై అణుబాంబు వేసినట్లే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మరోసారి మహా సంగ్రామంలో కమల దళం రెపరెపలాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకులతో పాటు.. ఇతర రాష్ట్రాల.. Read more

10. చైనాను చీలిస్తే.. శరీరాలు ఛిద్రం చేస్తాం.. జీ జిన్ పింగ్ వార్నింగ్

తమ దేశాన్ని చీల్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగినా ఇందుకు కారకులైనవారి శరీరాలను ఛిద్రం చేస్తామని, వారి ఎముకల్ని పిండి చేస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనా (బీజింగ్) కు వ్యతిరేకంగా.. Read more