టాప్ 10 న్యూస్ @ 6PM

1.దేశం ఏపీ వైపు నిలబడి చూసేలా పరిపాలన సాగిస్తా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మంచి పరిపాలన అందచేస్తానని ఏపీ నూతన సీఎం జగన్ వెల్లడించారు. ఎన్నికల్లో అద్బుత విజయాన్ని అందించిన ఆ దేవుడికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు…Read more 2.‘జగన్ ఇచ్చిన హామీని’ నిలబెట్టుకోవాలి..! ఏపీలో ఆర్టీసీ సమ్మెకు రెడీ అవుతున్నారు జేఏసీ సంఘాల నేతలు. సమ్మెకు తధ్యమంటూ సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం రిలీజ్ […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 5:57 PM

1.దేశం ఏపీ వైపు నిలబడి చూసేలా పరిపాలన సాగిస్తా

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మంచి పరిపాలన అందచేస్తానని ఏపీ నూతన సీఎం జగన్ వెల్లడించారు. ఎన్నికల్లో అద్బుత విజయాన్ని అందించిన ఆ దేవుడికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు…Read more

2.‘జగన్ ఇచ్చిన హామీని’ నిలబెట్టుకోవాలి..!

ఏపీలో ఆర్టీసీ సమ్మెకు రెడీ అవుతున్నారు జేఏసీ సంఘాల నేతలు. సమ్మెకు తధ్యమంటూ సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని చెబుతున్న నేతలు…Read more

3.వాస్తు దోషాలు.. ఏపీ సచివాలయంలో మార్పులు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో సెక్రటేరియట్ నుంచి పాలనను చేయనున్నారు. అయితే అక్కడి ఫస్ట్‌ బ్లాక్‌లో వాస్తు దోషాలు ఉండటంతో.. కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు…Read more

4.నిజామాబాద్ హైవేపై రైతుల ధర్నా..!

కామారెడ్డి జిల్లాలో రహదారి విస్తరణ పనుల్లో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు 160 మందికి పైగా రైతులు ధర్నాకు దిగారు. గ్రామస్థులు ధర్నాకు దిగడంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి…Read more

5.జగన్ ప్రమాణస్వీకారానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా?

ఏపీ సీఎం జగన్ పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. లోటు బడ్జెట్‌ కారణంగా ప్రథమంగా తానే అందరికి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నారు. తిరిగులేని మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్..హంగు, ఆర్భాటాలకు పోకుండా…Read more

6.ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: 105 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్‌

ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్ జట్టుతో తలపడుతున్న పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలిపోయింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు దించింది…Read more

7.మాటిస్తున్నా.. మహేష్ అభిమానులకు దేవిశ్రీ ప్రామిస్

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సంగీత ప్రియుల నాడి బాగా తెలిసిన ఈ మ్యూజిక్ డైరక్టర్ గత కొన్నేళ్లుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గతేడాది ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ చిత్రాలతో…Read more

8.యూరేసియన్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు పసిడి పంట!

అండర్‌-20 యూరేసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. కజకిస్థాన్‌లోని అల్మాటీలో గురువారం జరిగిన తొలిరోజు పోటీల్లో ఐదు స్వర్ణాలు, మూడు రజత పతకాలు కొల్లగొట్టారు. గుర్విందర్‌ సింగ్‌ (100 మీ.)…Read more

9.జోఫ్రా దూకుడు చూడాల్సిందే!

వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందు జోఫ్రా ఆర్చర్ కేవలం మూడు అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే, అతడి ఫామ్‌ని చూసి సెలక్టర్లు వరల్డ్‌కప్ ఆరంభం కావడానికి వారం రోజుల ముందు డేవిడ్ విల్లీ స్థానంలో జట్టులోకి…Read more

10.ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సాయిపల్లవి..!

చలాకీ భామ సాయిపల్లవి తాజాగా నటించిన సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో సూర్యకు జోడీగా పల్లవి ఈ సినిమాలో కనిపించింది. కాగా.. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో…Read more