Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

టాప్ 10 న్యూస్ @ 1PM

Top 10 News of The Day 23092019, టాప్ 10 న్యూస్ @ 1PM

1.పైన పటారం.. లోన లొటారం.. మెట్రో దూకుడుకు బ్రేక్ పడిందా..?

నిన్న అమీర్ పేట, నేడు రసూల్ పురా మరి రేపు ఎక్కడో..! మెట్రో ఎంతో భద్రం, సురక్షితం అని అధికారులు చేసిన ప్రచారం మాటలకే పరిమితమని తెలుస్తోంది. మెట్రో నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ నిండు ప్రాణాలు బలయ్యాయి…Read more

2.హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ్లి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు…Read more

3.హౌడీమోడీ ఈవెంట్.. ఫారిన్ మీడియా ఏమంటోంది ?

టెక్సాస్ లోని హూస్టన్ లో ఘనంగా జరిగింది హౌడీమోడీ ఈవెంట్.. మోడీతో అధ్యక్షుడు ట్రంప్ ఒకే వేదికను పంచుకున్నారు. దాదాపు 50 వేలమంది ప్రవాస భారతీయులు హాజరైన ఈ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయానికి యుఎస్ తో బాటు…Read more

4.రాహుల్ రీ-ఎంట్రీ… పున్ను హగ్ ఫెస్టివల్ షురూ!

బిగ్ బాస్‌ హౌస్‌లో పునర్నవి ఎడబాటుకు మోక్షం కలిగింది. ఆమె స్నేహితుడు, పులిహోర రాజాగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ మళ్ళీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు స్టార్ మా. ఇందులో రాహుల్…Read more

5.జుగల్బందీ భేటీలో ఎవరు ఎవరికి ప్లాంక్ కార్డు ?

హ్యూస్టన్ సదస్సే ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. మోడీ, ట్రంప్ ప్రపంచాధినేతలుగా నిలిచిన హ్యూస్టన్ భేటీపై యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. పలు దేశాధినేతలు సైతం తమ తమ అజెండాలను పక్కన పెట్టి సుమారు రెండు గంటల పాటు…Read more

6.బ్లాక్ లిస్ట్ లో పాక్? ప్యారిస్ గ్రూప్ షాక్!

పాకిస్తాన్‌‌‌‌కు ఫైనాన్షియల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌) గట్టి షాక్‌‌‌‌ ఇచ్చింది.  పాక్‌‌‌‌  టెర్రర్‌‌‌‌ గ్రూపులకు ఆర్థిక సాయం అందిస్తోందని, మనీలాండరింగ్‌‌‌‌కు పాల్పడుతోందని,  ఇండియాపై దాడులు చేస్తోందని ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ గుర్తించింది.  తాను తయారుచేసిన…Read more

7.పంజాబ్‌లో ఉగ్ర కుట్న భగ్నం.. భారీ ఆయుధాలు స్వాధీనం

దేశం భారీ విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. నిషేధిత ఉగ్ర సంస్థ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌(కేజెడ్ఎఫ్)కు చెందిన భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు ఏకే 47లు…Read more

8.సఫారీలతో ఓటమి.. టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా కోహ్లీ డేరింగ్ డెషిషన్?

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ టీమిండియా పేలవమైన ఆటతీరుతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయమే మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా…Read more

9.టీటీడీ బోర్డు సభ్యుడిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా మై హోం గ్రూపు వ్యాపార సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ బోర్డులో స్థానం కల్పించిన ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. చినజీయర్ స్వామి…Read more

10.సరికొత్త రూల్: నో హెల్మెట్.. నో పెట్రోల్

కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కర్ణాటక పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. వాహనదారులు హెల్మెట్‌ను…Read more

Related Tags