Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

టాప్ 10 న్యూస్ @ 10AM

top 10 news of the day 23082019, టాప్ 10 న్యూస్ @ 10AM

 1. కోడెల ఇంట్లో కంప్యూటర్లు చోరి

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరి జరిగింది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేసేదుందంటూ.. రాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని కంప్యూటర్‌ను చోరి.. Read more

2. హైకోర్టు తీర్పు పవర్ ప్రాజెక్టు విషయంలోనే: మంత్రి అనిల్

ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి, దోపిడీని అరికట్టేందుకే సీఎం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లినట్టు చెప్పారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రాజెక్టు.. Read more

3. ఏపీ రాజధానిగా దొనకొండకు హైప్: ఎకరం భూమి.. కోటి అట..

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ.. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి.. వాటికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక.. అమరావతి ముంపు.. Read more

4. విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణలో సోలార్ విద్యుదుత్పత్తిని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని , సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అన్ని నిజాలు.. Read more

5. ఇవాళ టీఎస్ సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ సెట్‌ (టీఎస్‌ సెట్‌) పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు బోర్డు ప్రకటించింది. తెలంగాణ.. Read more

6. ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ..

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. దేశ రాజధాని పారిస్‌ విమానాశ్రయంలో ఆ దేశ విదేశాంగా మంత్రి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు.. Read more

7. తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, గురువారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పలు.. Read more

8. బిగ్‌బాస్: మహేష్ ఔట్..? తప్పంతా తనదే..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3.. హాట్ హట్‌గా జరుగుతోంది. నువ్వెంతంటే.. నువ్వని ఇంట్లో.. రచ్చ చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇంతకూ బిగ్‌బాస్ హౌజ్‌లో ఏం జరుగుతోంది.. ఎప్పుడూ గొడవలు.. కొట్లాటలేనా.. గేమ్‌ ఆడేదైనా ఏమైనా ఉందా.. Read more

9. అల్లరి కష్ణుడికి ఇష్టమైన వంటకాలేంటో తెలుసా..?

అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా.. పలు రకాల పేర్లతో శ్రీ కృష్ణుడిని మనం పిలుస్తూ ఉంటాం. చెడును అంతమొందించి.. మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు. అప్పట్లో.. Read more

10. తడబడ్డ టాప్ ఆర్టర్.. ఆదుకున్న రహానె

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్ట్ మొదటి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. టీ20, వన్డే సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు.. తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా.. Read more

Related Tags