Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

టాప్ 10 న్యూస్ @5PM

Top 10 News of The Day 18102019, టాప్ 10 న్యూస్ @5PM

1.ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలు.. సీఎం జగన్ పిలుపు

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ, రోగులకు ఇచ్చే పెన్షన్ సహా పలు అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు…Read more

2.బ్రేకింగ్: రేపు ఉదయం 10.30 గం.లకు చర్చలు జరపండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రేపు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్పొరేషన్.. కార్మికులతో ప్రభుత్వం చర్చలకు  జరపాలని  తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం వాడివేడిగా సాగిన వాదనల తర్వాత ఇరుపక్షాల వైఖరిని న్యాయస్ధానం తప్పుబట్టింది…Read more

3.కమలదళంలో చెమటోడుస్తున్న సుజనా.. ఎందుకంటే ?

చంద్రబాబుతో సాధ్యం కానిది.. అమిత్ షాకు సాధ్యమైంది… టిడిపి చేయలేనిది బిజెపి చేయగలుగుతోంది.. ఇంతకీ ఏంటనే కదా మీ సందేహం ? రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పార్టీ జెండా మోయించడం… సభ్యత్వ పుస్తకం పట్టుకుని…Read more

4.ట్రంప్ ఎఫెక్ట్: 311 మంది భారతీయులకు మెక్సికో షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మెక్సీకోలోని భారతీయులకు షాక్ ఇచ్చాడు. తన కఠిన నిర్ణయాలతో వేలాది మంది భారతీయులను ఇబ్బందులకు గురి చేసిన ట్రంప్.. తాజాగా మెక్సికోలో నివశిస్తున్న భారతీయులపై కన్నేశాడు. మెక్సీకోలో నివశిస్తున్న భారత్‌కు…Read more

5.ఆ జైలు ఇడ్లీలకు భలే గిరాకీ.. ఎందుకో తెలుసా?

నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చినట్లే ఇడ్లీ ధరలు కూడా ఎప్పుడో పెరిగిపోయాయి. భాగ్యనగరంలో ఇప్పుడు రెండు పెద్ద ఇడ్లీల ధర రూ.40లు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇడ్లీ రేటు సుమారు పాతిక నుంచి రూ.30 వరకు…Read more

6.పులి రాజుల ఫైటింగ్.. అబ్బో సినిమా రేంజ్‌లో ఉందిలే..!

ముందు ఏం జరిగిందో తెలీదు గానీ.. ఆ పులులు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. అంతే ఆ రెండింటికి పాత కోపాలన్నీ గుర్తు వచ్చినట్లు ఉన్నాయి. దీంతో నువ్వా..? నేనా..? ఇప్పుడే చూసుకుందాం అంటూ రణరంగంలోకి దూకాయి. ఒకదాన్ని మరొకటి…Read more

7.వెనక్కి తగ్గిన ఆ ఇద్దరు.. బరిలోకి బాలయ్య..?

ప్రతి ఏడాదిలో చివరగా వచ్చే పండుగ క్రిస్మస్. డిసెంబర్ 25న క్రిస్మస్ ఉండగా.. ఆ తరువాత ఆరు రోజులకు కొత్త సంవత్సరం వస్తుంది. దీంతో ఈ సీజన్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. అందుకే చిన్న హీరోలు కూడా తమ సినిమా విడుదలకు ఈ సీజన్‌ను …Read more

8.రివ్యూ: ‘రాజు గారి గది 3’ – కామెడీ హిట్టే గానీ.. స్టోరీ మాత్రం..!

రాజు గారి గది’ సిరీస్‌లో భాగంగా వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజు గారి గది 3’. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏమేరకు మెప్పించింది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం…Read more

9.రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేని పోపుల డబ్బా ఉండనే ఉండదు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని నార్మల్‌గా …Read more

10.తెలుగు ఆడియన్స్‌కు తమిళ దీపావళి!

తమిళ హీరోలు తెలుగులో తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే తమిళ డబ్బింగ్ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో వాళ్ళు ప్రతిసారి ప్లాప్స్ చవి చూడాల్సి వస్తోంది…Read more