Breaking News
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • నెల్లూరు: మర్రిపాడు మండలం అల్లంపాడులో ముగ్గురు అరెస్ట్‌. గుప్తనిధులు తవ్వకాలు చేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్‌. పరారీలో మరో ఇద్దరు, కారు స్వాధీనం.
  • ప్రధాని అధ్యక్షతన 2016లో జరిగిన సమావేశంలో.. అన్నిరాష్ట్రాల్లో టెలీహెల్త్‌ సర్వీస్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ అధికారులతో సమావేశం నిర్వహించాం. తెలంగాణలో అమలులో ఉన్నందున అదే విధానాన్ని అమలు చేయమని చెప్పా. తెలంగాణ ఈఎస్‌ఐ అధికారులు టెలీ హెల్త్ సర్వీస్‌తో.. ఎంవోయూ చేసుకోమనడంతో నేను లెటర్‌ రాశా. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా టెండర్ల పద్ధతి ద్వారా.. మందులు కొనుగోలు చేయాలని మంత్రిగా ఆదేశించా-అచ్చెన్నాయుడు.
  • కార్మికుల సొమ్ముదోచుకున్న అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఈఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికి తీయాలి-వైసీపీటీయూసీ నేత గౌతమ్‌రెడ్డి. ఇందులో ఎవరెవరు భాగస్వాములో కూడా వెల్లడించాలి. అచ్చెన్నాయుడును అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి-గౌతమ్‌రెడ్డి.

టాప్ 10 న్యూస్ @5PM

Top 10 News of The Day 17102019, టాప్ 10 న్యూస్ @5PM

1.లేటు వయసు ఘాటు కోరిక.. తల్లైతే తప్పేంటి ?

గతంలో 40ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే వారు. తల్లీ, పిల్లా ఆరోగ్యంతోపాటు ఇతర సామాజికాంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని మరీ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇపుడు పరిస్థితి మారుతోంది. ముదిమి వయసులోని…Read more

2.హుజూర్ నగర్‌లో భారీ వర్షం…సీఎం కేసీఆర్ సభ రద్దు

తెలంగాణాలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిదో అనే లెక్కలు తేలడం లేదు. టీఆర్ఎస్ నేత లు మాత్రం తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హుజూర్‌నగర్‌లో బహిరంగ సభ జరపాలని…Read more

3.రవిప్రకాశ్‌పై మరో కేసు.. 14 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్న టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డు…Read more

4.ధాన్యం కొనుగోలుకు రూ. 7 వేల కోట్లుః హరీష్‌రావు

ధాన్యం కొనుగోలు కోసం ముఖ్యమంత్రి రూ.7వేల కోట్లు కేటాయించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మార్కెట్‌లో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. వరికి రూ.1835, పత్తికి రూ.5550 మద్దతు ధరకు…Read more

5.రేప్‌‌‌‌‌ను సమర్థించిన సావర్కర్‌‌కా ‘భారతరత్న ‘ ? మెహబూబా ముఫ్తీ

హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కు ‘ భారతరత్న ‘ పురస్కారాన్ని ప్రకటించాలన్న బీజేపీ డిమాండుపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. తన ట్విటర్ లో ఆమె కమలం పార్టీ పై ధ్వజమెత్తారు. అత్యాచారాన్ని సమర్థించిన…Read more

6.దేవస్థానం పెట్రోల్ బంక్‌లో నిధులు గోల్‌మాల్‌

శ్రీశైలం దేవస్థానం పెట్రోల్‌ బంక్‌లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేవస్థానానికి చెందిన పెట్రోల్ బంకులో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. బంకులో పనిచేసే సిబ్బంది భారీగా చేతివాటం ప్రదర్శించినట్టు…Read more

7.నవ్వు ఒక దివ్య ఔషధం… కడుపుబ్బా నవ్వితే…!

నవరసాలలో మన ఆరోగ్యాన్నిచ్చేది మాత్రం హాస్యరసమే. అలాంటి హాస్యం (నవ్వు) మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని వైద్యులు, మానసిక నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా ఎలాగైతే నవ్వుతుంటామో పెరిగి…Read more

8.సింహానికి ఎదురెళ్లి… సురక్షితంగా…!

ఓ వ్యక్తి సింహం బోనులోకి ప్రవేశించి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో గల జూపార్క్‌లో చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన రేహాన్‌ ఖాన్‌(28) అనే వ్యక్తి జూ సందర్శనకు వెళ్లాడు. జూ పార్క్‌లో సింహాన్ని ఉంచిన ఎన్‌క్లోజర్‌ గ్రిల్స్‌ ఎక్కి అందులోకి…Read more

9.క్లాస్‌లో అమ్మాయిల బీరు పార్టీ.. ఇంతలోనే షాక్!

సహజంగా అమ్మాయిల బర్త్‌డే పార్టీలంటే.. కేక్‌, నలుగురి ఫ్రెండ్స్‌తో సింపుల్‌గా అయిపోతుంటాయి. అబ్బాయిల పుట్టినరోజు వేడుకుల్లా బీరు బాటిల్స్‌తో ఫుల్ జోష్ ఉండదు. అయితే తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయి తన పుట్టినరోజు నాడు ఏకంగా బీరు…Read more

10.పదహారణాల పడుచు అమ్మాయి.. ప్రీ-లుక్‌లో ఎవరీమె?

‘మహానటి’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇవాళ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం యూనిట్ ప్రీ-లుక్‌ను విడుదల చేశారు…Read more

Related Tags