Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

టాప్ 10 న్యూస్ @ 5 PM

Top 10 News of The Day 11112019, టాప్ 10 న్యూస్ @ 5 PM

1.అయోధ్య తీర్పు: జస్టిస్ రంజన్ గొగోయ్‌కి ప్రశంసల వెల్లువ!

అయోధ్య కేసుపై శనివారం ఏకగ్రీవ తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయిని ప్రశంసించారు. ఆదివారం గౌహతిలో జరిగిన పుస్తక ఆవిష్కరణలో, చీఫ్ జస్టిస్-హోదా…Read more

2.ఇంగ్లీష్‌పై ముందడుగే.. మడమతిప్పేది లేదన్న జగన్

నాలుగేళ్ళలో ఏపీవ్యాప్తంగా పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు…Read more

3.ఒకే ట్రాక్‌పై రెండు రైళ్ల ఢీ.. మానవ తప్పిదమేనంటున్న అధికారులు!

భాగ్యనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు రెండూ కూడా ఒకే ట్రాక్ మీదకు రావడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పదించిన రైల్వే అధికారులు…Read more

4.‘ఎడ్డీ’ ముంగిట భారీ సవాల్.. బై-పోల్ పరీక్ష నెగ్గేనా ?

కర్నాటకలో ఎట్టకేలకు ఉప ఎన్నికల నగారా మోగింది. మొన్నటి రాజకీయ సంక్షోభంలో పదవులకు అనర్హులైన 17 ఎమ్మెల్యేల వల్ల ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం…Read more

5.టిఎన్ శేషన్ గురించి రాహుల్ గాంధీ… ఏమన్నారంటే!

ఎన్నికల కమిషన్‌లో నిష్పాక్షికంగా, ధైర్యంగా నూతన సంస్కరణలను ప్రారంభించిన టిఎన్ శేషన్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం జ్ఞాపకం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా అమలు చేసి…Read more

6.పెళ్లికొడుకు మృతి కేసులో మరో ట్విస్ట్..!

ఇల్లంతా పెళ్లిసందడి.. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. అంతలోనే పెను విషాదం అలముకుంది. కొద్దిగంటల్లో పెళ్లి జరగుతుందనగా.. పెళ్లికొడుకు శవమై కనిపించాడు. అదికూడా కళ్యాణ మండపంలోనే…Read more

7.పొత్తులు కలవకున్నా.. ‘ కత్తులు ‘ కలిశాయి

మహారాష్ట్రలో సిధ్ధాంత పరంగా వైరుధ్యాలు గల శివసేన-కాంగ్రెస్ పార్టీల మధ్య ‘ స్నేహానికి ‘ బీజం పడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సేనకు మద్దతునివ్వాలనే యోచన దిశగా కాంగ్రెస్ పంథా సాగుతోంది…Read more

8.‘పేరడీ’ల వర్మ.. ఇదెక్కడి ‘మర్మం’..?

రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడీయన వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా… ఒకప్పుడు మాత్రం క్రియేటివ్ డైరక్టర్. పలు సంచలన చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. అయితే…Read more

9.‘సాహో’ షాకిచ్చినా.. ప్రభాస్ తగ్గనంటున్నాడా..!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తరువాత రెబల్‌స్టార్‌కు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చాయి. అయితే అక్కడకు వెళ్లేందుకు అంత ఆసక్తిని చూపని ప్రభాస్…Read more

10.పున్నూతో మూవీ.. రాహుల్ హ్యాపీ.. హ్యాపీ..?

మొత్తానికి ‘బిగ్‌బాస్ 3 విన్నర్ టైటిల్‌’ సాధించాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఒక్కసారి కూడా.. ఇంట్లో కెప్టెన్‌ కాని.. రాహుల్.. ఏకంగా బిగ్‌బాస్ సీజన్‌ 3కి టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అందులోనూ.. రొమాంటిక్ పర్సన్‌గా…Read more