Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • హైదరాబాద్ లో పెరిగిన ఫోర్ వీలర్లఅమ్మాకాలు . మేనెలతో పోల్చితే రెండు నుంచి మూడింతలు పెరిగిన సేల్స్. సేల్స్ పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్న హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు . మే నెలలో 326 ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్లు. జూన్ లో 848 , జూలై లో 1149 రిజిస్ట్రేషన్లు . ఆర్ టి ఎ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పాండు రంగా నాయక్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • బ్లాక్ బస్టర్ ఆగస్టుకు ఆహా OTT రెడి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆహా OTT ఆగస్టులో 10 సినిమా లను అందిస్తుంది. పాపులర్ యాంకర్ సుమ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తదితరులు ఫేసుబుక్ లైవ్ ద్వారా పలు విషయాలు ప్రకటించారు. మొదట దిల్ రాజు బుచ్చినాయుడు కండ్రిగ సినిమాని ప్రకటించారు. ఆగస్ట్ 21న ఆహాలో విడుదల. తెనుగు వినోదాన్ని అందిస్తున్న ఆహా OTT లో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చూడవచ్చు. పాపులర్ కమెడియన్ హర్ష సరికొత్త రియాలిటీ షో ప్రకటించారు. తమాషా విత్ హర్ష అనే సరికొత్త షో ఈనెల 22నుండి మొదలు. చివరగా సుమ OTT లో తొలిసారి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. సమకాలీన అంశాలతో అల్ ఈజ్ వెల్ అనే వెరైటీ షో ని ప్రకటించారు. ఆగస్ట్ 14 నుండి సుమ ఆల్ ఈజ్ వెల్ ప్రసారం అవుతుంది.

టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 News Of The Day, టాప్ 10 న్యూస్ @ 6PM

కథువా కేసు తీర్పు: ముగ్గురికి జీవితఖైదు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఆరుగురిని దోషులుగా పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి జీవితఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది… Read More

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డేంజర్లో పడిందా ?

ఢిల్లీలో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్ట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోను ప్రసారం చేశాడన్న ఆరోపణపై..సాదా దుస్తుల్లో వఛ్చిన యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి.. Read More

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత జరిపిన ఈ తొలి సమావేశం.. ఐదున్నర గంటలపాటు కొనసాగింది… Read More

యూపీ సీఎం కసి.. జర్నలిస్ట్ అరెస్ట్.. సుప్రీం ఏం చెబుతుందో ?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ వీడియోను షేర్ చేశాడన్న ఆరోపణపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు… Read More

దీదీని చంపితే కోటి.. ఎవరిదా వార్నింగ్.?

పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు నానాటికి ఉద్రిక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉన్నాయి… Read More

జయరాం హత్య కేసులో ఛార్జిషీటు.. రాకేశ్ సహా 12మంది నిందితులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఛార్జిషీటు సిద్ధమైంది. మొత్తం 23 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు.. Read More

అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందన్న యూవీ.. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండటం.. Read More

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ?

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను. ఆంధ్ర ప్రదేశ్‌కు… Read More

‘సాహో’ టీజర్ ఎప్పుడంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ‘సాహో’ నిర్మాతలు స్వీట్ న్యూస్ అందించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ డేట్‌ను ఇవాళ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు… Read More

కొడాలి.. నిన్ను మంత్రిని చేసింది ఆయనే…కేశినేని వ్యంగ్యాస్త్రాలు

ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం చెందినప్పటి నుంచి ఆ పార్టీ విజయవాడ ఎంపీ  కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది… Read More

 

Related Tags