Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @ 1 PM

1.భూమా వారసుడెవరు ? ఫ్యామిలీలో రచ్చకిదేనా కారణం ?
రాయలసీమను భూమా నాగిరెడ్డి ఫ్యామిలీని వేరువేరుగా చూడలేం. సీమ పాలిటిక్స్‌పై అంతగా చెరగని ముద్ర వేసిన ఫ్యామిలీ అది. కానీ ఫ్యామిలీలో ఇద్దరి హఠాన్మరణం ఇప్పుడు కుటుంబంలో కొత్త చిచ్చు రేపినట్లుంది.. Read More

2.బైరెడ్డి సారూ..కాషాయ తీర్థం కన్ఫర్మా..?
బైరెడ్డి రాజశేఖరెడ్డి. ఎన్నికల ముందే పుట్టింటికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నారు. సీమలో పార్టీకి సీన్‌ లేదని కండువా మార్పిడికి సిద్ధమయ్యారు. మరీ బైరెడ్డి రైట్‌ స్టెప్‌ వెనుక కారణాలేంటి? అన్న చర్చ జరుగుతోంది.. Read More

3.ఏపీలో పశువులకూ.. ఆధార్ గుర్తింపు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాడి పశువులకూ.. ఆధార్ గుర్తింపు సౌకర్యం కల్పించింది. పశుసంవర్థక శాఖ ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. రాష్ట్రంలోని పశువులకు ఆధార్‌ను కల్పించేందుకు సిద్ధం అయ్యింది.. Read More

4.ఏడాదిలో ఏడోసారి.. శ్రీశైలానికి ముప్పేనా ?
శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత తొలిసారి ఇది. ఒకే సంవత్సరం ఒకే సీజన్‌లో ఏడోసారి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. జులై మూడో వారంలో కూడా డ్రైగా కనిపించిన శ్రీశైలం ప్రాజెక్టు.. Read More

5.వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వర్డింగ్ చేస్తున్నారా.. అయితే..?
పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సోషల్ మీడియాను యూజ్ చేస్తున్న వారు ఎక్కువైపోతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్ వంటి యాప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. అలాగే ప్రతిరోజు వాట్సాప్‌లో వేల మెసేజ్‌లు వస్తుంటాయి.. Read More

6.మాకు వేధింపులు కొత్తేం కాదు.. అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తా..!!
వ్యాపార లావాదేవీల్లో ఇద్దరి భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. చిన్న విషయాన్నిపెద్దది చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.. Read More

7.సాహోరే ‘బాహుబలి’.. ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు
‘ఈశ్వర్‌’, ‘రాఘవేంద్రు’డి ఆశీర్వాదాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ‘వర్షం’ కురిపిస్తూ.. ‘ఛత్రపతి’లా ఉత్తరాదిన కూడా ‘చక్రం’ తిప్పుతూ.. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా ఖ్యాతి ఘడించి.. Read More

8.‘బ్రెగ్జిట్ డీల్’ పై ఇంకా అయోమయం.. బోరిస్ జాన్సన్ ‘బిక్క మొహం’ ! జనరల్ ఎన్నికలు తప్పవా?
బ్రిటన్ లో బ్రెగ్జిట్ డీల్ పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అసలు ఈ వ్యవహారం ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మంగళవారం ఈ డీల్ పై బ్రిటన్ పార్లమెంటులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. Read More

9.అక్కడ ధనుష్.. ఇక్కడ చరణ్.. హిట్ కొట్టేనా..?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడని సమాచారం.. Read More

10.శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికురాలు మృతి
ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బ్యాంకాక్ నుంచి దోహా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు ఉన్నట్లుండి గుండెపోటుకు గురైంది.. Read More