Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • విజయవాడ: మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు వసంతరావు ఆచూకీ లభ్యం. గత నెల 24వ తేది అర్దరాత్రి క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు మృతి. అనంతరం మార్చూరుకి తరలించిన వైద్య సిబ్బంది. ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యం. వృద్ధుడు వివరాలు ఆసుపత్రి రికార్డుల్లో నమోదుచేయని సిబ్బంది. దింతో మిస్టరీగా మరీనా వసంతారావు మిస్సింగ్. పోలీసుల రంగప్రవేశంతో వృద్ధుడు ఆచూకీ. గత 10 రోజులుగా కుటుంబ సభ్యులు వివరణ కోరిన సరైన వివరణ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తో గత 10 రోజులుగా ఆందోళనలో కుటుంబ సభ్యులు.. డాక్టర్లు తీరు పై కుటుంబ సభ్యులు ఆగ్రహం. ఆసుపత్రి సీసీ కెమెరాలలో వృద్ధుడు ఆచూకీ గమనించిన పోలీసులు. మార్చురీలో ఉన్న మృతదేహం వసంతరావుది కావడంతో విషాదంలో కుటుంబo.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • గుంటూరు: అరండల్ పేట పరిధిలో ప్రత్యర్దులను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు. రమణ అనే వ్యక్తి ని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసు నిందితులు.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • విజయవాడ: మాజీ స్పీకర్ కోడెల కుమారుడు కోడెల శివరాంపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు. 2018లో పొలం కొనుగోలు చేసి 90 లక్షలు ఇవ్వటంలేదని పటమట పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. అధికార బలంతో అప్పట్లో డబ్బు ఇవ్వలేదని, గత ఏడాది నుంచి మధ్యవర్తి రాంబాబుకి ఇచ్చేసాను అని ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు. మధ్యవర్తి రాంబాబును కలిస్తే రివాల్వర్ తో బెదిరిస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. గత నెల 25న ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో సీపీకి ఫిర్యాదు చేయనున్న అనంత్.
  • క్లినికల్ ట్రైల్స్ కు తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ . నిమ్స్ కు పర్మిషన్ ఇచ్చిన ఐసీఎంఆర్ . ఇప్పటికే కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న కిమ్స్. అనేకసార్లు అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించిన నిమ్స్.

టాప్ 10 న్యూస్ @ 1 PM

Top 10 news of the day, టాప్ 10 న్యూస్ @ 1 PM

1.జగన్-చిరంజీవి కలిసింది అందుకేనా ?
తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా చర్చనీయాంశమైన ఏపీ ముఖ్యమంత్రి జగన్,  మెగాస్టార్ చిరంజీవిల భేటీకి ముహూర్తం కుదిరింది. సోమవారం అమరావతి ఇందుకు వేదికైంది. వీరిద్దరి భేటీకి సంబంధించి.. Read More

2.ట్రోఫీ ఆడేందుకు వెళ్తూ.. అనంతలోకాలకు హాకీ క్రీడాకారులు..
మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడిన ఈ ఘటనలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు.. Read More

3.జేసీ సూట్‌కేసులో రూ.6 లక్షలు మాయం..! దొంగ ఎవరంటే.!
టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూట్‌కేసులో 6 లక్షల రూపాయలు సడన్‌గా మాయం అయ్యాయి. ఆయన సూట్‌కేసులోని డబ్బును కార్ డ్రైవర్ కాజేశాడు. దీంతో.. Read More

4.కేసీఆర్ బాటలో పొంగులేటి… అదృష్టం కలిసొస్తుందా!
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం నారాయణపురంలో ఆయన సహస్ర చండీయాగం చేస్తున్నారు. పొంగులేటికి చెందిన మామిడి తోటలో యాగశాలను నిర్మించి.. Read More

5.చిక్కుల్లో సల్మాన్.. భారీ భద్రత పెంపు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆయన హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్‌ను నిలిపివేయాలంటూ కొంతమంది సల్మాన్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.. Read More

6.దారుణం: పేలిన గ్యాస్ సిలిండర్.. 12 మంది మృతి..!
ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ పేలి 12 మంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌‌లోని మొహమ్మదాబాద్‌లో జరిగింది. సిలిండర్ పేలడంతో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది.. Read More

7.కమల్ అంతపని చేశాడా..! నటి సంచలన వ్యాఖ్యలు
లోకనాయకుడు కమల్‌హాసన్‌పై నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్‌ను కమల్, తన తనయకు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేశారు.. Read More

8.రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ?
జంతువులతో బాటు మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులిని పట్టడానికి అటవీ అధికారులు అతి పెద్ద ప్రయత్నమే చేశారు. ఆరు రోజులు ముప్పు తిప్పలు పెట్టిన ఈ పులి ఎట్టకేలకు పట్టుబడింది.. Read More

9.హుజుర్‌నగర్ ఉప ఎన్నికతోనే ఉత్తమ్ భవితవ్యం..!
తెలంగాణాలో హుజుర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి.. Read More

10.వ్యూహం ఫలించేనా… బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ?
మాజీ టీమిండియా కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు.. Read More

Related Tags