Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: రైతు భరోసా కేంద్రాలకు వైయస్ రాజశేఖర రెడ్డి పేరును పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఇకపై రైతు భరోసా కేంద్రాలను డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గా వ్యవహరించనున్న ప్రభుత్వం. రైతులకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా అయన పేరును ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
  • ఈరోజు తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. రుతుపవనాల కు తోడైన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం. 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్. రాజారావు
  • కాకినాడ: కరోన పరీక్షల్లో నిర్లక్ష్యం. కరోనా వైద్య పరీక్షలు విషయంలో బట్టబయలు అవుతున్న సిబ్బంది నిర్లక్ష్యం. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సమాచారం ఇస్తున్న సిబ్బంది. కరోనా ల్యాబ్ నుండి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను నెగెటివ్ గా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్న సిబ్బంది. రెండు రోజుల క్రితం కాకినాడ నగరంలో జగన్నాయక్ పూర్ లో ఒక యువకుడికి కరోనా పాజిటివ్. మీకు కరోనా పాజిటివ్ వచ్చిదంటూ ఆదే మధ్యాహ్నం సమాచారం ఇచ్చిన పోలీసులు. లేదు నెగిటివ్ వచ్చిందంటూ చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.
  • శ్రీకాకుళం జిల్లా : ఇచ్చాపురంలో 14 రోజులు లాక్ డౌన్ - జిల్లా కలెక్టర్ జె నివాస్. తాగునీరు, పాలు, నిత్యావసర సరుకులు, మందులు మినహా అన్ని దుకాణాలు మూసివేత. కాంటైన్మెంట్ జోన్ లో ఏ దుకాణానికి అనుమతి లేదు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతి. ఇచ్చాపురంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిర్ణయం. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. మాస్కులు ధరించాలి. వ్యక్తుల మధ్య దూరం పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 144వ సెక్షన్ అమలు. ఎక్కడా ప్రజలు గుమిగూడరాదు. ప్రజలు సహకరించాలి.
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం. వచ్చేవారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా సులభతర పరిపాలన. ప్రతీశాఖకు ఒక నోడల్ అధికారి, సాంకేతిక సహాయకుడు. రేపటిలోగా ఉద్యోగుల మాస్టర్ డేటా. ముద్ర సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటల్ సంతకాల సేకరణ. ఈ ఆఫీస్ పై ఉద్యోగులకు త్వరలో శిక్షణ. ఈ ఆఫీస్ కోసం అధికారుల హైరార్కీ మ్యాపింగ్.

టాప్‌ 10 న్యూస్ @9AM

Top 10 News @9AM 10.10.2019, టాప్‌ 10 న్యూస్ @9AM

1. రెండు రోజులు భారత్‌లో జిన్‌పింగ్.. కీలక నిర్ణయాలు..?

శుక్రవారం భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రానున్నారు. ఈరోజు మధ్యాహ్నాం 2 గంటలకు ఆయన చెన్నైకి చేరుకోనున్న జిన్‌పింగ్. ఆయనకు స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ. రెండ్రోజుల శిఖరాగ్ర సమావేశానికి.. Read More

2. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి వారిని తరిమేస్తాం.. అమిత్ షా

ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తారు మోడీషాలు. తాము సెట్ చేసుకున్న ఎజెండాకే పెద్ద పీట వేస్తూ.. తరచూ ఏదో ఒక హాట్ టాపిక్‌ను తెర మీదకు తీసుకొచ్చే ఈ ద్వయం.. Read More

3. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ మృతి!

సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్. ఆమోస్ కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలో ఈయన పాత్ర చాలా కీలకమైంది.. Read More

4. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై ‘బిగ్ న్యూస్- బిగ్ డిబేట్‌’లో కీలక చర్చ!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం.. Read More

5. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

కాకినాడ – లింగంపల్లి మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్‌లో పొగలు వచ్చాయి. కాకినాడ నుంచి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏలూరు స్టేషన్‌కు సమీపిస్తుండగా.. Read More

6. వివాదస్పద ఎమ్యెల్యేకు సీఎం వార్నింగ్..పద్దతి మార్చుకోవాలంటూ క్లాస్?

సీఎం జగన్..ప్రజల్లో తన విశ్వసనీయత చాటుకునేందుకు ఎంతదూరం వెళ్లడానికైనా సిద్దమైనట్టు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్దమవుతుంది. తన తండ్రి వైఎస్సార్ కంటే ఇంకా గొప్ప పాలన అందించడానికి కృషి చేస్తానని జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా జగన్ అడుగులు పడుతున్నాయి. ముందుగా రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే.. Read More

7. ఇంట్రెస్టింగ్‌గా చిరు, జగన్‌ల భేటీ..!!’

ప్రస్తుతం సైరా సినిమాతో మంచి జోష్‌ మీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాక్సాఫీస్‌ వద్ద ‘సైరా’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే సమయంలో.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌తో భేటీ కాబోతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం వీరిద్దరి మీటింగ్.. తెలుగు రాష్ట్రాలో చాలా ఆసక్తిగా.. Read More

8. ర’కూల్’ సీక్రెట్స్.. క్రేజీ అండ్ నాటీ గురూ!

‘కెరటం’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా.. Read More

9. అమెజాన్ ప్రైమ్‌లోకి ‘సాహో’ వచ్చేస్తోంది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. ఈ మూవీ ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు.. Read More

10. ఆ చోటంటే మహిళలకు హడల్!

మహిళా భద్రతకు పెద్దపీట వేయాలనుకుంటున్నా.. పలు మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యాచారాలు ఆగడం లేదు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే మహిళా భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్.. Read More

Related Tags