Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

వీకెండ్స్‌కి గోవా వెళ్తున్నారా? అయితే మీకు తెలియని 10 నిజాలు!

Top 10 interesting facts about Goa, వీకెండ్స్‌కి గోవా వెళ్తున్నారా? అయితే మీకు తెలియని 10 నిజాలు!

కాస్త ఎక్కువ బ్రేక్స్ వస్తే.. వర్క్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది గోవాకి వెళ్తూంటారు. గోవా అంటేనే వినోదానికి మారు పేరు. ముఖ్యంగా యువకులు గోవాకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రశాంతమైన బీచ్ ఒడ్డున సేదతీరేందుకు ఇష్టపడని వారుండరు. ఎప్పుడూ విదేశీ టూరిస్టుల తాకిడితో కోలాహలంగా ఉంటుంది గోవా. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర గోవా సొంతం. నిజానికి గోవా చాలా చిన్న ప్రాంతం. ఇక్కడ లిక్కర్ యధేచ్ఛగా దొరుకుతుంది. ముఖ్యంగా లిక్కర్ కోసమే గోవా వెళ్తుంటూరు కొంతమంది.

అలాంటి గోవాలో అక్కడ టూరిస్టులకు కూడా తెలియని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం:

1. గోవాకి లిక్కర్ సామ్రాజ్యంగా పేరు ఉంది. మరి అలాంటి గోవాలో ఎన్ని బార్లు ఉన్నాయో తెలుసా? 7 వేల బార్లు. అవును మీరు వింటుంది నిజమే. అవన్నీ ప్రభుత్వం లైసెన్స్ కలిగినవే. మరి లైసెన్స్ లేనివి ఎన్నుంటాయో.. ఊహించండి.

2. దేశంలోనే మొదటి మెడికల్ స్కూల్ ఇక్కడే ఉంది. విభిన్న సంస్కృతులు కలగలిసిన గోవాలో ఎంతో ప్రత్యేకత ఉంది. 18 శతాబ్ధంలోనే పోర్చుగీసుల పాలనలో ఇక్కడ మెడికల్ స్కూల్ నిర్మాణం జరిగింది. ఆసియా దేశంలోని అత్యంత పురాతనమైన మెడికల్ కాలేజీ, లైబ్రరీ గోవా సొంతం.

Top 10 interesting facts about Goa, వీకెండ్స్‌కి గోవా వెళ్తున్నారా? అయితే మీకు తెలియని 10 నిజాలు!3. కుళ్లిపోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవీయర్ శరీరం. ఆయన గొప్ప సువార్త కర్త. 1542 పోర్చుగీసులు పరిపాలించే సమయంలో ఆయన సువార్త వ్యాప్తికి కృషి చేశారు. ఇప్పటికీ ఓ చర్చిలో ఆయన శరీరాన్ని కుళ్లిపోకుండా ఓ గాజు పేటికలో భద్రపరిచారు.

4. ఆసియాలోనే ఏకైక నేవల్ ఏవియేషన్ మ్యూజియం గోవాలో ఉంది. ఇలాంటివి దేశంలో 6 ఉన్నాయి. కానీ అన్నింటిల్లో ప్రప్రధమమైనది ఇదే.  వైమానిక యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు, సమకాలీన యుద్ధ విమానాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు.

5. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం కూడా గోవానే. జాతీయ గణాంకాల ప్రకారం గోవాలోని ఒక వ్యక్తి సగటు ఆదాయం ఏడాదికి రూ.1,92,652లుగా ఉంది. దీంతోనే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలా ఉంటుందో.

6. అలాగే గోవాలో టూవీలర్ రైడ్స్, సైకిల్ రైడ్స్‌లు చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఈ రైడ్స్‌ని అతి తక్కువ బడ్జెట్‌తో ఎంజాయ్ చేస్తారు.

7. గోవాలో ఖనిజ ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. 16వ శతాబ్ధం నుంచి ఇప్పటి వరకూ గోవాలో ఇనుము త్రవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Top 10 interesting facts about Goa, వీకెండ్స్‌కి గోవా వెళ్తున్నారా? అయితే మీకు తెలియని 10 నిజాలు!8. మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ని ప్రారంభించింది గోవాలోనే. సముద్ర మార్గం ద్వారా పోర్చుగీసులు ఇక్కడికి చేరుకోవడంతో.. తొలిసారిగా ఇక్కడే ఇంగ్లీషు మీడియం స్కూల్‌ని స్టార్ట్ చేశారు.

9. గోవాలో 30 శాతం అడవులే ఉంటాయి. నేచర్ కూడా ఇక్కడ ఎక్కువే. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువాగా కనిపిస్తాయి. అలాగే సెలబ్రిటీలను ఆకట్టుకునే కేసినోవాలకు ఇక్కడ పెట్టింది పేరు.

10. ఇక గోవాలో ఎక్కడ చూసినా పోర్చుగీసు చరిత్రకు సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. గోవాలో పార్టీ కల్చర్‌తో పాటు ఆలయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈసారి గోవా వెళ్లినప్పుడు వీటిపై మీరూ కూడా ఓ లుక్కేసేయండి.

Related Tags