Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

టాలీవుడ్‌లో పై చేయి స్వీటీదేనట..!

Top 10 Highest Paid Actresses in Tollywood: Is Anushka Shetty in the first place, టాలీవుడ్‌లో పై చేయి స్వీటీదేనట..!

వారి మత్తెక్కించే అందాలతో.. హీరోలకి ధీటుగా.. నటిస్తూ.. ఫ్యాన్స్‌ని మెప్పిస్తారు హీరోయిన్స్. అందులోనూ.. హీరోయిన్స్.. వాళ్ల స్టార్‌డమ్‌ని నిలబెట్టుకొని ఇండస్ట్రీలో ఉండేది చాలా తక్కువ. కొంతమంది హీరోయిన్స్‌ అయితే.. ఒకటి రెండు సినిమాలు చేసి.. మెరుపు తీగల్లాగ మాయమవుతూంటారు. కానీ.. అందరికీ ధీటుగా.. అన్నీ తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడ్డ హీరోయిన్స్ చాలా అరుదు అనే చెప్పాలి.

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్కపెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యున‌రేష‌న్స్ అందుకుంటున్నారు. ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది స్వీటీ అలియాస్ అనుష్క. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.

ఇక న‌య‌న‌తార కూడా అంతే.. ఈమె కూడా ఒక్కో సినిమాకు 4 నుంచి 7 కోట్ల పారితోషికం అందుకుంటుంది. సైరా కోసం 7 కోట్ల వ‌ర‌కు న‌య‌న‌తారకు ఇచ్చార‌ని టాక్. ఇక స‌మంత అక్కినేని కూడా దుమ్ము దులిపేస్తుంది. ఈమె ఒక్కో సినిమాకు 2 నుంచి 2.5 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తుంది. మ‌రో బ్యూటీ పూజా హెగ్డే.. సినిమాకు దాదాపు కోటి 70 నుంచి 2 కోట్ల వ‌ర‌కు అందుకుంటుంది.

అలాగే.. కాజల్ అగర్వాల్.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ టాలీవుడ్‌లో ఆమె స్టార్ డమ్‌ ఏం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. 34 ఏళ్లు దాటినా.. హొయలొలికించే అందాలతో.. ఈ అమ్మడు ట్రెండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం కాజల్.. కోటిన్నర తీసుకుంటుందని సమాచారం. కాగా.. సాయి పల్లవి, తమన్నా కూడా దాదాపు కోటికి పైగానే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారట. అలాగే.. కైరా అద్వానీ, రాశిఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్‌లు కోటి తీసుకుంటున్నారు. అయితే.. నయన్ మిగతా భాషల్లో కూడా నటిస్తోంది. నిజానికి ఆమె తమీళియన్. ఈ లెక్కన చూస్తుంటే.. స్వీటీనే.. టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ తీసుకుంటుంది.