ఆకాశానంటుతున్న టమాటా ధరలు

ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమాటా ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుండటం జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు టమాట కొనాలన్నా, తినాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవలసి వస్తోంది....

ఆకాశానంటుతున్న టమాటా ధరలు
Follow us

|

Updated on: Jul 16, 2020 | 3:20 PM

Tomato Price Increase : టమాటా ధర ఠారెత్తిస్తోంది. కేజీ పదీ పదిహేను రూపాయలుండే ధర ఇటీవల బాగా పెరిగింది. హోల్‌సేల్‌లోనే కేజీ రూ.40 వరకూ ఉంది. రిటైల్‌గా రూ.50 నుంచి రూ.60 వరకూ పలుకుతోంది. ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమాటా ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుండటం జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు టమాట కొనాలన్నా, తినాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవలసి వస్తోంది. ప్రస్తుతం పెరిగిన టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.

సైజు కూడా బాగా చిన్నవి. వాటిలోనే కొద్దిగా పెద్దవి వేరు చేసి మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. నాణ్యత పెద్దగా లేకున్నా మార్కెట్ లో మాత్రం భగ్గుమంటోంది. టమాటా అంతా మదనపల్లి మార్కెట్‌ నుంచే హైదరాబాద్‌కు వస్తుంది. అక్కడ ధర ఎలా ఉన్నా.. స్థానిక మార్కెట్లలో మాత్రం టమాటా ధర భారీగా పెరగుతోంది.

టమాటాతోపాటు వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ ధరలు కూడా రూ. 40 పైనే అమ్ముతున్నారు. ఉల్లిపాయ ధరలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అసలే కరోనా కష్టాలతో ముప్పు తిప్పలు పడుతున్న సామాన్యులకు వంటింటి కష్టాలు మరింత వణిికిస్తున్నాయి. పట్టణం వదిలి పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు ఇంతలా  పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.