Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ. ఎమెర్జెన్సీ పనులు నిమిత్తం తమను కంపెనీలోకి అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్. రోజు వారీ కార్యకలాపాల కోసం కంపెనీలోనికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం ఇవ్వలేదన్న కంపెనీ తరుపు న్యాయవాది.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

‘హమ్మయ్య ! మా క్వారంటైన్ ముగిసింది.. హ్యాపీ’! హాలీవుడ్ కపుల్

కరోనా బారిన పడిన హాలీవుడ్ కపుల్ టామ్ హాంక్స్, రీటా విల్సన్ ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు.  తన సినిమా 'ఎల్విస్ ప్రెస్లీ' షూటింగ్
Hollywood Couple Tom Hanks, ‘హమ్మయ్య ! మా క్వారంటైన్ ముగిసింది.. హ్యాపీ’! హాలీవుడ్ కపుల్

కరోనా బారిన పడిన హాలీవుడ్ కపుల్ టామ్ హాంక్స్, రీటా విల్సన్ ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు.  తన సినిమా ‘ఎల్విస్ ప్రెస్లీ’ షూటింగ్ కోసం మార్చి 11 న ఆస్ట్రేలియాకి వచ్చిన హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ కి మొదట కరోనా వైరస్ సోకింది. ఆ తరువాత ఆయన భార్య రీటా విల్సన్ కూడా ఇదే రుగ్మత బారిన పడ్డారు. అయితే వెంటనే ఇద్దరూ సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లారు. వీరు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిస్థితిని తమ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలా ద్వారా తెలియజేస్తూ వచ్చారు. కఠిన ఆహార నియమాలు పాటించి కరోనాకు గుడ్ బై చెప్పారు. ఓ ప్రైవేట్ జెట్ విమానంలో ఆస్ట్రేలియా నుంచి శుక్రవారం అమెరికాకు బయల్దేరి వెళ్లారు. లాస్ ఏంజిలిస్ చేరుకున్న ఈ కపుల్ చిరునవ్వులతో  తమ కారులో కనబడి…. తమ ఆరోగ్యంకోసం ప్రార్థించినవారికందరికి కృతజ్ఞతలు తెలిపారు.  టామ్ హాంక్స్ చివరిసారి ఈ నెల 23 న ట్వీట్ చేస్తూ.. రెండు వారాల తరువాత మేమెంతో బెటర్ గా ఫీలవుతున్నాం అని పేర్కొన్నారు. అటు రీటా విల్సన్.. నాలుగు నిముషాల వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘క్వారంటైన్ స్టర్ క్రేజీ.. సీ ఇట్ టు బిలీవ్ ఇట్’ అని వ్యాఖ్యానించారు.

 

 

 

Related Tags