Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

ఈయనే బల్లాల దేవుడంటే నమ్మలేం.. అసలు రానాకు ఏమైంది?

Tollywood young hero Rana daggubati lean look shocking photo viral, ఈయనే బల్లాల దేవుడంటే నమ్మలేం.. అసలు రానాకు ఏమైంది?

బహుబలి మూవీలో హీరో బాహుబలి పాత్ర చేసిన ప్రభాస్‌కి ఎంత పేరు వచ్చిందో .. విలన్ బల్లాల దేవుడి పాత్రలో రానాకు కూడా అంతే పేరు వచ్చింది. టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీనుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన కనిపించడం మానేశారు. తన టాలెంట్‌తో టాలీవుడ్‌లోనే కాకుండా ఏకంగా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే రానా గత కొంతకాలంగా మూవీలకు దూరంగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన విదేశాల్లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంటున్నట్టు ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్ననంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వస్తున్నాడు. తాజాగా రానా పోస్ట్ చేసిన ఫోట్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసినవారంతా షాక్ అవుతున్నారు . బాహుబలి మూవీలో కండలు తిరిగిన దేహంతో కనిపంచిన బల్లాలదేవుడు .. ఇంతగా చిక్కిపోడానికి కారణం ఏమిటో అని నెటిజన్లు, రానా అభిమానులు బాధపడుతున్నారు.

రానా చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో కనిపించాడు. ఆ తర్వాత నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రానా పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోపై ఎన్నో ఆయన అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయగంగా దగ్గుబాటి కుటుంబమే అసలు విషయాన్ని వెల్లడిస్తే తప్ప ఎవ్వరికీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం రానా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న హాథీ మేరీ సాథీ సినిమాను పూర్తి చేయాల్సింది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తెలుగు సినిమా షూటింగ్‌ ప్రారంభించాల్సి ఉంది. ఇక రానా నటించిన హిందీ మూవీ హౌస్‌ఫుల్ 4 అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కండలు తిరిగిన శరీరంతో టాలీవుడ్ కండల వీరుడిగా పేరుగాంచిన రానా దగ్గుబాటి మళ్లీ అదే రూపంలో ఎప్పుడు కనిపిస్తాడోనంటూ సినీజనం ఆశగా చూస్తున్నారు.