Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

నెట్టింట్లో మూడు భారీ పోస్టర్లు.. అదిరిపోయింది ఎవరిదంటే.?

Tollywood Movies First Look Posters Revealed, నెట్టింట్లో మూడు భారీ పోస్టర్లు.. అదిరిపోయింది ఎవరిదంటే.?

ముగ్గురు స్టార్ హీరోలు.. మూడు బడా సినిమాలు.. అన్నీ కూడా సంక్రాంతి రిలీజ్‌లు.. దసరా పండుగ సందర్భంగా ఈ స్టార్లు తమ ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ ఇచ్చారు. సరికొత్త లుక్స్‌లో పోస్టర్లు విడుదల చేసి.. విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘అల వైకుంఠపురంలో’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘ఎన్‌బీకె 105’ చిత్రాలు వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇవాళ విడుదలైన వాటి ఫస్ట్ లుక్ పోస్టర్లపై ఓ లుక్కేద్దాం.

అల వైకుంఠపురంలో…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజైన ‘సామజవరగమన’ లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో బన్నీ పూర్తిగా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడు. బ్యాగ్రౌండ్ ఆటస్థలం.. స్టైలిష్ స్టార్ ఏమో విలన్స్‌తో హార్డ్ హిట్టింగ్ గేమ్. అటు సాఫ్ట్ లుక్.. ఇటు మాస్ లుక్.. ఇంకేముంది ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పాలి. జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లే.

సరిలేరు నీకెవ్వరూ…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. 2020 సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ ఈ సినిమాను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్, ప్రీ-లుక్ పోస్టర్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆర్మీ మేజర్ లుక్‌లో మహేష్‌ను చూసి ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు. విజయదశమి కానుకగా చిత్ర యూనిట్ దసరా పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టిన మహేష్ బాబు మరోసారి ‘ఒక్కడు’ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడని చెప్పాలి. అనిల్ తన మునపటి సినిమాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా కమర్షియల్ ఎలెమెంట్స్‌తో పాటుగా మంచి సందేశాన్ని ఇస్తున్నారు. ఈవిల్‌ను సమూలంగా నాశనం చేయడానికి యువతరం యుద్ధం చేయాలంటూ రిలీజైన ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఎన్‌బీకె 105…

‘జై సింహ’ మూవీ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఎన్‌బీకె 105’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. హ్యాపీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నారట. అంతేకాక ఒక సిన్సియర్ పోలీస్ ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారాడన్నది చిత్ర కథాంశం అని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లలో బాలయ్య ఫ్రెంచ్ గడ్డంతో సంథింగ్ స్పెషల్ లుక్‌లో అద్భుతమైన మేకోవర్‌తో కనిపించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో బాలకృష్ణ రక్తమోడుతున్న కత్తి చేతపట్టి కనిపించారు. అక్కడో ఏదో ఫంక్షన్ జరుగుతున్న సందర్భంలో బాలయ్య ఊచకోతకు సిద్దమైనట్లు కనిపిస్తోంది ఆ ఫోజు. దర్శకుడు రవికుమార్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందట.