జనసేనానిపై గుర్రుగా ఉన్న ‘తెలుగు’ హీరోలు !

తెలుగు ఇండ్రస్ట్రీలో పలువురు హీరోలు జనసేనానిపై గుర్రుగా ఉన్నారట. ఎవరికీ అవకాశం దొరికితే వారు.. పవన్‌ను ఏకిపారేసేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన తప్పేంటి.? పార్టీ పురోగతి, ప్రజా సమస్యలపై బిజీబిజీగా ఉన్న పవన్‌ కల్యాణ్‌పై సదరు హీరోలకు ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా..? మొన్నటి వరకు హీరోగా ఎంతోమంది అభిమానుల్ని సంపాధించుకున్న పవన్‌ కల్యాణ్, రాజకీయాల్లో అడుగు పెట్టాక జనసేన పనులతో జనాల్లో కలిసిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జనాల […]

జనసేనానిపై గుర్రుగా ఉన్న 'తెలుగు' హీరోలు !
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 4:50 PM

తెలుగు ఇండ్రస్ట్రీలో పలువురు హీరోలు జనసేనానిపై గుర్రుగా ఉన్నారట. ఎవరికీ అవకాశం దొరికితే వారు.. పవన్‌ను ఏకిపారేసేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన తప్పేంటి.? పార్టీ పురోగతి, ప్రజా సమస్యలపై బిజీబిజీగా ఉన్న పవన్‌ కల్యాణ్‌పై సదరు హీరోలకు ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా..? మొన్నటి వరకు హీరోగా ఎంతోమంది అభిమానుల్ని సంపాధించుకున్న పవన్‌ కల్యాణ్, రాజకీయాల్లో అడుగు పెట్టాక జనసేన పనులతో జనాల్లో కలిసిపోయారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జనాల మధ్యే ఉంటూ..ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది తెలుగుభాష. ఈ నేపథ్యంలోనే తెలుగు భాషపై పవన్‌ చేస్తున్న పోరాటం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి పాకింది. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని.. అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ విమర్శలు చేసాడు పవన్ కల్యాణ్. తెలుగు చిత్రపరిశ్రమలో ఒకరిద్దరు హీరోలు మాత్రమే తెలుగు చదవడం రాయడం నేర్చుకోలేదు. ఇప్పుడు వాళ్లనే అన్నాడా లేదంటే అందర్నీ టార్గెట్ చేసాడా తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీపై ఈయన చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు పవన్‌ను విలన్‌ను చేస్తున్నాయట.