Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి

TeluguFilms Producer Rangarao Dies Of ill health, టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు ఇండష్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ రంగస్థల, సినీ నటులు శివప్రసాద్ మరణవార్త నుంచి కోలుకునేలోపే ఇటీవల ఓ నిర్మాత రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. తాజాగా శ్రీనాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ అధినేత ఆలపాటి రంగారావు బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన్ను ఆనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ గత రాత్రి  పరిస్థితి విషమించి కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న రంగారావు… న్యాయనికి శిక్ష,  కాయ్ రాజా కాయ్, చిన్నారి స్నేహం, రాజకుమార్, నాకు పెళ్లాం కావాలి, దోస్తి దుష్మన్(హింది) వంటి చిత్రాలను నిర్మించారు. ఈయనకు కాన్‌ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఉంది. 70వ దశకంలో ఆయన అగ్ర నిర్మాతగా వెలిగొందారు. ఈ వెటరన్ నిర్మాతకు  ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  దీంతో పలువురు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆలపాటి రంగారావు ఇంటికి వెళ్లి ఆయన మ‌ృతదేహానికి నివాళులు అర్పించారు.

Related Tags