Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

Tollywood : రేర్ కాంబో..డార్లింగ్‌తో నాగ్ అశ్విన్..!

Tollywood : Nag Ashwin Movie With Prabhas, Tollywood : రేర్ కాంబో..డార్లింగ్‌తో నాగ్ అశ్విన్..!

Tollywood : ‘మహానటి’..తెలుగులో వచ్చిన ఈ మూవీ భారత చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని చెక్కిన తీరుకు తెలుగు జాతి యావత్తు సాహో అంది. మహానటి సావిత్రి జీవితంలోని అన్ని కోణాలను ఈ చిత్రంతో ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ మూవీకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. అయితే ఆ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా..నాగ్ అశ్విన్ మరో మూవీని ప్రకటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చినా..అవన్నీ అధికారిక ప్రకటనల వరకు వెళ్లలేదు.  అయితే ఇండస్టీ వర్గాల తాజా సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట నాగ్ అశ్విన్. ఇప్పుడు అందుకు తగ్గ భారీ కథను కూడా డిజైన్ చేసి పెట్టుకున్నాడట. ప్రస్తుతం ప్రభాస్..’జిల్‌’ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నారు. ఇది పూర్తి కావడానికి ఇంచుమించు మరో 6 నెలలు సమయం పట్టేలా ఉంది. కాగా ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో డార్లింగ్‌కి అశ్విన్ కథ నచ్చితే మాత్రం ఓ క్రేజీ కాంబో సిద్దమైపోయినట్లే. లెట్స్ వెయిట్ అండ్ సి.

ఇది కూాడా చదవండి :   ‘అమ్మ బయోపిక్’…శోభన్‌బాబు దొరికేశాడు..!

Related Tags