26ఏళ్ల తర్వాత జత కట్టనున్న హిట్ పెయిర్..?

Chiranjeevi and Vijayshanti to team up again?, 26ఏళ్ల తర్వాత జత కట్టనున్న హిట్ పెయిర్..?

తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘సైరా’ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. త్వరలో కొరటాల దర్శకత్వంలో 152వ చిత్రంలో నటించనున్నాడు. ఇందుకోసం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపిస్తుండగా.. మరో కీలక పాత్ర కోసం లేడి అమితాబ్ విజయశాంతిని కొరటాల సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక తన పాత్రను గురించి తెలుసుకున్న విజయశాంతి, ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తాజా సమాచారం.

అయితే టాలీవుడ్‌లో చిరు, విజయశాంతిలకు హిట్ పెయిర్ అన్న పేరుంది. ఈ కాంబినేషన్‌లో అప్పట్లో 19 సినిమాలు రాగా.. అందులో 10కి పైగా పెద్ద విజయాలు అందుకున్నాయి. అందుకే అప్పట్లో దర్శకనిర్మాతలు వీరిద్దరితో సినిమాలు తీసేందుకు క్యూ కట్టేవారు. ఇక 1993లో చివరి సారిగా వీరిద్దరు ‘మెకానిక్ అల్లుడు‌’లో కనిపించారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అందుకే అవకాశం వచ్చినా కలిసి నటించలేదన్న టాక్ ఫిలింనగర్‌లో బాగా వినిపించింది. ఇదంతా పక్కనపెడితే తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటిస్తే మాత్రం చిరు సినిమాకు మరో అదనపు ఆకర్షణ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా దాదాపు 12ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *