ఇమ్రాన్ ఖాన్.. తెలుగు హీరోయిన్.. ఏమా కథ..?

సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్న గురుద్వార్‌ను సందర్శించేందుకు భారతీయ సిక్కులను ఆ దేశ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదిన కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కార్యక్రమం జరగనుండగా.. అందుకోసం భారత్‌లోని కొందరు సిక్కు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారిలో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్‌ కౌర్ చోటు దక్కించుకుంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సం రోజున ముఖ్య అతిథిగా రావాల్సిందిగా పాకిస్తాన్ […]

ఇమ్రాన్ ఖాన్.. తెలుగు హీరోయిన్.. ఏమా కథ..?
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 4:08 PM

సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్న గురుద్వార్‌ను సందర్శించేందుకు భారతీయ సిక్కులను ఆ దేశ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదిన కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కార్యక్రమం జరగనుండగా.. అందుకోసం భారత్‌లోని కొందరు సిక్కు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారిలో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్‌ కౌర్ చోటు దక్కించుకుంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సం రోజున ముఖ్య అతిథిగా రావాల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం నుంచి ఆమెకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కార్యక్రమం తరువాత పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను కలవనున్న అతి కొద్ది మందిలోనూ పూనమ్ పేరు ఉండటం విశేషం.

కాగా గురునానక్ పుట్టిన, మరణించిన రెండు స్థలాలు పాక్‌లోనే ఉన్నాయి. ఆయన జన్మస్థలం లాహోర్‌కు దగ్గర్లోని నాన్‌ కనాసాహిబ్‌లో ఉంది. ఇక కర్తార్‌పూర్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో దాన్ని పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తున్నారు. ఇక ఈ కారిడార్ పనులను భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సరం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఈ నెల 8న భారత భూభాగంలో మోదీ.. నవంబర్ 9న పాకిస్తాన్ భూభాగంలోని ఇమ్రాన్ ఖాన్ కారిడార్‌లను ప్రారంభించనున్నారు.

ఇక కర్తార్ పూర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం కూడా వెళ్లనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందాన్ని కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు సోనియాగాంధీ నియమించింది. ఈ బృందంలో మన్మోహన్ తోపాటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీఎన్ సింగ్, రణదీప్ సూర్జేవాలా, దీపెందర్ హుడా, జితిన్ ప్రసాద్‌లు ఉన్నారు.