“ఎవరైనా అంత ఇస్తానంటే బాగుండు” అంటున్న సమంత

సమంత కూడా ఎక్కువ డిమాండ్ చేస్తోందా? ఒకప్పుడు మోస్ట్ యాక్సిసెబుల్ హీరోయిన్ అనిపించుకున్న సమంత ఇప్పుడు సడెన్‌గా పారితోషికం అమాంతం పెంచేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ బేబీ హిట్ వల్లే ఆమె ఇలా రేటు పెంచేసిందంటూ వైబ్‌సైట్స్‌లో ప్రచారం సాగుతోంది.

రంగస్ధలం సినిమా రూ. 130 కోట్లు రూపాయలు కలెక్ట్ చేసింది. అందులో రామలక్ష్మిగా నటించిన సమంతకి వచ్చిన పేరు అంతాఇంతా కాదు. అ ంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత కూడా సమంత వైఖరిలో మార్పు రాలేదని అంతా అనుకున్నారు. అప్పుడు నిర్మాతల నుంచి ఎక్కువ మనీ డిమాండ్ చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నట్టు? ఓ బేబీలో హోల్ అండ్ సేల్ అమె హీరో.. ఆమె హీరోయిన్. ఆ సినిమా ఆడిందంటే కారణం సమంత. ఇందులో హీరో నాగశౌర్య పాత్ర డమ్మీ. మొత్తంగా సమంత చుట్టే సినిమా తిరుగుతోంది. ఆమె నేమ్ అండ్ ఫేమ్ వల్లే మంచి హిట్ అయ్యింది. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో ఆమె స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నట్టే కదా. అందుకే ఆమె మూడు కోట్ల రూపాయలు అడుగుతోందని ప్రచారం జరుగుతోంది.

ఐతే సమంత ఈ గాసిప్‌లు విని నవ్వుతోంది. ఎవరైనా 3 కోట్లు ఇస్తే బాగుండు. వెంటనే సినిమా సైన్ చేస్తానంటోంది. అంటే అదంతా అబద్దమే అనేది అమె మాట. ఓ బేబీ సినిమా తర్వాత సమంత మరో సినిమా సైన్ చేయలేదు. మన్మథుడు 2 లో ఆమె చిన్న గెస్ట్ రోల్ చేస్తోంది. ఇది కాకుండా మరో సినిమా ఇంకా ఒప్పుకోలేదు. మంచి కథలు వస్తేనే చేస్తానంటోంది. అలాంటప్పుడు 3 కోట్లు డిమండ్ అనే మాటే లేదు కదా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *